పైడితల్లమ్మ సిరిమాను చెట్టు దర్శించుకున్న విజయదుర్గ యూత్ సొసైటీ సభ్యులు*
జనం న్యూస్ 26 సెప్టెంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
ప్రజల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి చెట్టును విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ,విజయదుర్గ యూత్ సొసైటీ ప్రెసిడెంట్ కేశవపట్నం చంద్రిక చందు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రిక మాట్లాడుతూ విజయనగరం జిల్లా శ్రీ పైడితల్లి అమ్మవారు ప్రభుత్వం రాష్ట్ర పండగ గా ప్రకటించడం పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పైడితల్లి అమ్మవారి దీవెనలు జిల్లా వాసులందరికీ లభించాలని కోరారు.విజయనగరం జిల్లాలో పెద్ద వేమలి గ్రామంలో ఈ సంవత్సరం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను గుర్తించిన నేపద్యంలో ఇసురుమాను సిరుమాను చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద వేమలి గ్రామం నుండి శనివారం అమ్మవారి సిరిమాను చెట్టును విజయనగరం తరలిస్తారని తెలిపారు. పైడితల్లి అమ్మవారి పండగకు ఓ ప్రత్యేకత ఉందని చల్లని తల్లి పైడితల్లి అమ్మవారు దర్శించుకునేందుకు దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తారని. పసుపు కుంకుమ, చీర సారేలును, ఘటాలను అమ్మవారికి సమర్పిస్తూ భక్తులు మొక్కలు తీర్చుకునే సాంప్రదాయం. శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ప్రత్యేక మన్నారు. ఈ కార్యక్రమంలో విజయ దుర్గ సిటీ సభ్యులు జయలక్ష్మి, సాయి షణ్ముక్,హారిక, స్వాతి,యమున,శివ పుణ్యమoతుల, రమణతదితరులు పాల్గొన్నారు.