పోక్సో కేసులో నిందితుడికి 20సం.ల కఠిన కారాగారం, జరిమానా*
- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 08 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం మహిళా పోలీసు స్టేషన్లో 2021 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు విజయనగరం పట్టణానికి చెందిన కుమిలి సురేష్ (26సం.లు)కు పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి శ్రీమతి కే.నాగమణి గారు 20సం.ల కఠిన కారాగార శిక్ష మరియు రూ.5,500/-లు జరిమానా విధిస్తూ నవంబరు 7న తీర్పు వెల్లడించినట్లుగా విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ నవంబరు 7న తెలిపారు. వివరాల్లోకి వెళ్ళితే.. విజయనగరం పట్టణానికి చెందిన 15 సంవత్సరాల బాలికను విజయనగరం పట్టణం మంగళవీధికి చెందిన నిందితుడు కుమిలి సురేష్ (26సం||లు) అనే వ్యక్తి పెళ్ళి చేసుకుంటానని నమ్మించి, మోసం చేసి తరచూ ఆమె ఇంటికి వెళ్ళి బాలికపై అత్యాచారంకు పాల్పడినట్లుగా విజయనగరం మహిళా పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయగా, అప్పటి ఎస్ఐ కె.టి.ఆర్ లక్ష్మి పోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేశారు. ఈ కేసును అప్పటి దిశా మహిళా పిఎస్ డిఎస్పీ టి.త్రినాధ్ దర్యాప్తు చేసి, నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు. ఈ కేసులో ప్రాసిక్యూషను పూర్తి అయ్యే విధంగా మహిళా పిఎస్ సిఐ ఇ.నర్సింహమూర్తి చర్యలు చేపట్టగా, నిందితుడు కుమిలి సురేష్ (26 సం.లు) మైనరు బాలికపై అత్యాచారంకు పాల్పడినట్లుగా నేరం రుజువు కావడంతో విజయనగరం స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు కె.నాగమణి గారు నిందితుడికి 20సం.లు కఠిన కారాగారం మరియు రూ.5,500/- ల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ తెలిపారు. ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసువారి తరుపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటరు మావూరి శంకరరావు వాదనలు వినిపించగా, మహిళా పోలీసు స్టేషన్ సిఐ ఇ.నర్సింహమూర్తి పర్యవేక్షణలో కోర్టు కానిస్టేబుల్ జి.ఎస్.నాయుడు, సి.ఎం.ఎస్. హెడ్ కానిస్టేబులు సిహెచ్. రామకృష్ణ సాక్షులను కోర్టులో హాజరు పర్చారన్నారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడే విధంగా పోలీసువారి తరుపున వాదనలు వినిపించి స్పెషల్ పిపి మావూరి శంకరరావు, ఇతర అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ గారు అభినందించారు.