ముఖ్యమంత్రి గారు వాలంటీర్ల కోసం అసెంబ్లీలో ప్రకటించండి.

ముఖ్యమంత్రి గారు వాలంటీర్ల కోసం అసెంబ్లీలో ప్రకటించండి.

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ డిమాండ్*
జనం న్యూస్ 08 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటిర్లందరికి న్యాయం చేస్తామని చెప్పిన మాటలు నమ్మి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో వాలంటీర్లు సహకారం కూడా ఉన్నది కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో గ్రామ, వార్డు వాలంటీర్లను కొనసాగిస్తున్నట్లు ప్రకటన చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ డిమాండ్ చేశారు.ఉద్యోగం, ఉపాధి రాజ్యాంగంలో కలిపించబడిన హక్కుని కాలరాయవద్దు అని విజయనగరంలో ఎ.పి గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్స్ యూనియన్ ( ఏఐటీయూసీ అనుబంధం ) అధర్యంలో వాలంటీర్లు అందరూ కలిసి ర్యాలీగా వెళ్ళి విజయనగరంలో స్థానిక అంబేద్కర్ జంక్షన్ (బాలాజీ జంక్షన్) లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వినతిపత్రం సమర్పించి మానవహారం నిర్వహించి ముఖ్యమంత్రి గారూ వాలంటీర్లు కి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని నినాదాలు చేశారు.ఈ సందర్భంగా బుగత అశోక్ మీడియాలో మాట్లాడుతూ 2019 లో సచివాలయ వ్యవస్థ కంటే ముందుగానే వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతి యువకులను వాలంటీర్లుగా నియమించి వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను ప్రజల వద్దకు చేరవేడయంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదిగా సేవలు చేయడం జరిగిందనీ అందరికీ తెలిసిన విషయమే అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తె వాలంటీర్లను కొనసాగిస్తాం అని ఇచ్చిన హామీ ఇప్పటి వరకు అమలు చేయకపోవడం వలన వాలంటీర్లు ఆవేదన చెందుతున్నారు అని అన్నారు. రాష్ట్రంలో 2 లక్షల అరవై వేల మంది వాలంటీర్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు వాలంటీర్లు అందరికీ న్యాయం చేస్తారని ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్ని రాజకీయ ఒత్తిళ్ళకి గురి చేసిన కూటమి ప్రభుత్వం గెలుపుకోసం వారి వంతుగా కృషి చేసిన వాలంటీర్ల ఆశల్లో నీళ్ళు చల్లకుండ వారి ఆవేదన అర్థం చేసుకుని ఉద్యోగాల్లో కొనసాగించాలన్నారు. 6 నెలలుగా ప్రభుత్వం నుండి గౌరవ వేతనం కూడా చెల్లించకపోతే ఎందరో మహిళలు ఆ గౌరవ వేతనం మీదే కుటుంబంలో కొంత ఆర్థక ఇబ్బందులను నెట్టుకొస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు వాలంటీర్స్ అందరికి న్యాయం చేస్తామని నెలకు పదివేల రూపాయలు గౌరవ వేతనం పెంచి ఇస్తామని వాలంటీర్లు అందరికి సమాజంలో మంచి గుర్తింపు గౌరవం వుండే పద్ధతిలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని మరిచిపోవద్దు అని గుర్తు చేశారు. అలాగే ఎన్నికల సమయంలో గత ప్రభుత్వ రాజకీయ నాయకులు ఒత్తిడి చేసి బలవంతపు రాజీనామాలు చేయించడం వల్ల చాలా మంది వాలంటీర్స్ ఒత్తిళ్ళకి తట్టుకోలేక బలవంతంగా రాజీనామాలు చేసారనీ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని మరచిపోకుండా వాలంటీర్స్ అందరికి ఉద్యోగ భద్రత కల్పించాలని, గౌరవ వేతనం పదివేల రూపాయలు ఇప్పించాలని, గత 6 నెలలుగా బకాయి ఉన్న గౌరవ వేతనాన్ని విడుదల చేయించాలని, రాజకీయ ఒత్తిళ్లుతో రాజీనామా చేసిన వాలంటీర్లను మన్నించి తిరిగి విదుల్లో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఉన్నత చదువులు చదువుకొని ప్రభుత్వానికి సేవ చేయాలి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో వాలంటీర్ ఉద్యోగాల్లో చేరిన వాలంటీర్ అందరి భవిష్యత్తుకు భరోసా కల్పించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. 11 వ తేదీ నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో వాలంటీర్లుకి న్యాయం జరగకపోతే ఏఐటీయూసీ వాలంటీర్లకు అండగా నిలబడి వాళ్ళని న్యాయం జరిగే వరకూ దశల వారీ పోరాటాలకు కార్యాచరణతో వెళ్ళక తప్పదనీ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ రవీంద్ర,  విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మరియు రూరల్ లో వార్డు, గ్రామ సచివాలయల నుంచి బొండపల్లి మొదలైన మండలాల నుంచి జిల్లా వ్యాపితంగా వాలంటీర్లు పాల్గొన్నారు.