మోడల్ స్కూల్ విద్యార్ధి మృతి….!
జనం న్యూస్ 07 జనవరి
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
విజయనగరంలో మరో ప్రైవేట్ హాస్పిటల్ దారుణం వెలుగు చూసింది. నగరంలో ఏపీ మోడల్ హైస్కూల్ విద్యార్థికా వైద్యం నిమిత్తం సూర్య హాస్పిటల్ ఓ ఇంజక్షన్ ఇవ్వడంతో అది వికటించి విద్యార్థి కన్నవారికి దూరం అయ్యాడు. దీంతో స్కూల్లో పై నుంచి కింద పడి గాయపడిన విద్యార్థిని చికిత్స నిమిత్తం హొస్పటల్ జాయన్ చేస్తే హాస్పిటల్ యాజమాన్యం కు తెలియకుండా సిబ్బంది ఇంజక్షన్ ఇవ్వడం వల్లనే తమ బిడ్డ మృత్యువాత పడ్డారని కన్నవారు ఆవేదన చెందుతున్నారు. దీంతో మా బిడ్డ ఏ లోకాల్లో ఉన్నా తక్షణమే తీసుకురావాలని ఆస్పత్రి యాజమాన్యంపై ధ్వజమెత్తడంతో పాటు హాస్పిటల్ లోనే ఆందోళనకు దిగడమే కాక పోలీసులకు ఫిర్యాదు చేసారు.