రోబోటిక్స్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు ను ప్రారంభించిన ఎమ్మెల్యే*.

రోబోటిక్స్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు ను ప్రారంభించిన ఎమ్మెల్యే*.

జనం న్యూస్ 07 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని MALD డిగ్రీ కళాశాల నందు రోబోటిక్స్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు ( వర్క్ షాప్) కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే డీగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గారు పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు,

రోబోటిక్స్ పైన నిర్వహించి వర్క్ షాప్ కేంద్రాన్ని ఎమ్మెల్యే రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగినది,

ఎమ్మెల్యే మాట్లాడుతూ,గతంలో గద్వాల ప్రాంతంలో అక్షరాస్యత లో వెనుకబడిన ప్రాంతంగా నిలబడేది. కానీ ఇప్పుడిప్పుడే గద్వాల అక్షరాస్యత శాతం పెరుగుతుంది. ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా వివిధ రకాల టెక్నాలజీలు రావడంతో విద్యార్థుల్లో కూడా మంచి నైపుణ్యత కలుగుతుంది అని తెలిపారు.ఇటీవలే గద్వాలలో సైన్స్ ఫెయిర్ నందు పాఠశాలలో విద్యార్థులు టెక్నాలజీ సైన్స్ రోబోటిక్ సంబంధించిన వాటిపై ప్రయోగాలను చేసి వాటిని గురించి వివరించడం జరిగింది. విద్యార్థులలో చదువుతోపాటు ఇలాంటి టెక్నాలజీ రోబోటిక్ సంబంధించిన విషయాలపై కూడా అవగాహన పెంచుకోవడం చాలా అవసరం అని తెలిపారు.ప్రస్తుతం వివిధ దేశాలలో రోబోటిక్స్ సంబంధించిన రోబోటిక్స్ ను ఉపయోగించి ఎంతోమంది ప్రయోగాలు చేస్తూ వాటిని వాడుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కూడా రోబోటెక్నో ద్వారా రోగులకు ఆరోగ్య సమస్యలు పరిష్కరించే విధంగా జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా గద్వాలలో గతంలో కంటే గద్వాలలో విద్యా వ్యవస్థ పై లో నర్సింగ్ కాలేజీ డిగ్రీ కాలేజీ మహిళ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతంలోని పేద విద్యార్థులు చదువుకోవాలని అన్ని రకాల సదుపాయాలతో విద్యార్థులకు వివిధ ప్రాంతాల వెళ్లే పరిస్థితి లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతంలోని విద్యార్థులకు వివిధ రంగాలలో నైపుణ్యతను కలిగించే విధంగా రోబోటిక్స్, టెక్నాలజీ సంబంధించిన వంటి శాస్త్రవేత్తలు ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన సదస్సును భవిష్యత్తులో మరెన్నో నిర్వహించాలని పేర్కొన్నారు ‌.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, కౌన్సిలర్ పూడూరు కృష్ణ, మాజీ ఎంపీపీ విజయ్, మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, నాయకులు కురుమన్న, భగీరథ వంశీ, పవన్ యూదవ్ కాలేజీ ప్రిన్సిపాల్, తదితరులు పాల్గొన్నారు.