సడక్ సురక్ష అభియాన్ జాగ్రత్త

సడక్ సురక్ష అభియాన్ జాగ్రత్త

జనం న్యూస్ 07 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా 

జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ చేతుల మీదుగా డిటిఓ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సడక్ సురక్ష అభియాన్ జాగ్రత్త పోస్టర్లను ఆవిష్కరించారు.మన దేశంలో మోటారు వాహనాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో రహదారి స్రమాదాలు నానాటికి అధికమవుతున్నాయి. ఈ నవనాగరిక, ఆధునిక, వేగవంతమైన సమాజము మరియు కంప్యూటర్ యుగములో ప్రతి వ్యక్తికి మోటార్ వాహనము అవసరం తప్పనిసరి అయినది. ప్రస్తుత పరిస్థితిని ఒకసారి గమనించినట్లుయితే ప్రతిఒక్క కుటుంబం కనీసం రెండువాహనములకు తక్కువగా కలిగియుండుటలేదు. ఈ రద్దీకి తగినంతగా మనము రహదారులను ఏర్పాటు చేసుకొనలేక పోవుచున్నాము. నేటి వేగవంతమైన మరియు పోటీతత్వ సమాజంలో, మానవ తప్పిదం వలన, సరిపడినన్ని రహదారులు లేకపోవుట, మోటారువాహనములను సరియైన కండిషన్లో ఉంచుకొనకపోవడంవలన, అతివేగంగా వాహనములను నడుపుట వలన, వాహన డ్రైవర్ల నిర్లక్ష్య వైఖరి వలన రహదారి పై ఇతర రహదారి వినియోగదారుల బాధ్యతారహిత ప్రవర్తన, రహదారి నియమాలను, ట్రాఫిక్ సిగ్నల్స్ను సరిగా పాటించకపోవుట, అవగాహన లోపము వలన రహదారి ప్రమాదాలు ఎక్కువ అగుచున్నవి. ప్రతిరోజు ఈ ప్రమాదాలు సర్వసాధారణం అయిపోయినవి. ఈ వార్తలు లేకుండా దినపత్రిక కనిపించదు. రహదారి ప్రమాదాలు మనలను స్పందించచేయడం ఏనాడో ఆగిపోయింది. రహదారి ప్రమాదాల వలన అనేక మంది ప్రజలు మరణిస్తున్నారు. క్షతగాత్రులవుతున్నారు. ఎంతో ఆస్తినష్టం జరుగుచున్నది. ప్రపంచంలో ప్రతి ఏటా జరిగే మరణాలలో 40 శాతం మరణాలను రహదారి ప్రమాదాలే కారణము.మనదేశంలో దాదాపుగా ప్రతి సం॥రము 5 లక్షల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల దాదాపుగా 1,50,000 (ఒక లక్ష యాభై వేలు) మంది చనిపోవడం జరుగుతుంది. అంతేకాక 5 లక్షల మంది దాకా గాయపడటం జరుగుతుంది. దాదాపుగా రోజుకు 1300 మంది రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోవడం జరుగుతుంది. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 20 వేల రోడ్డు ప్రమాదాలు సంభ విస్తే అందువల్ల 6 వేల మంది వరకు చనిపోతున్నారు, మరియు 20 వేలకు మించి తీవ్రంగా గాయపడుతున్నారు.ఈ రహదారి ప్రమాదాల బారినపడిన వారిపై ఆధారపడిన కుటుంబాలు ఏ ఆధారము లేక రోడ్డుపై అనాధలైపోవుచున్నారు. క్యాన్సర్. ఎయిడ్స్, హృద్రోగము మరియు ఇతర ప్రాణాంతక వ్యాధుల కంటే ఎక్కువ రహదారి ప్రమాదాలలోనే ప్రాణనష్టం జరుగుచున్నది. ప్రపంచంలో నానాటికి సంఖ్య పెరుగుట వలన మరియు శీఘ్రగతిని పారిశ్రామికీకరణ జరుగుతుండడం వలన, వాహనముల సంఖ్య విపరీతముగా పెరుగుట వలన రహదారిపై రద్దీ అధికముగా ఏర్పడుట వలన పూర్తిగా ప్రమాదాలు సంభవించకుండ చూడటం అసాధ్యం. వివిధ సర్వేలలో పేర్కోన్నట్లు ప్రమాదాలు ఎక్కువగా మానవ తప్పిదాల వలన, అవగాహన రాహిత్యం వల్ల, చిన్న చిన్న పొరపాట్ల వలన జరుగుతున్నాయి. కాని రహదారులు వినియోగించువారు కొంచెం సహకరిస్తే ప్రమాదాలను చాలావరకు తగ్గించవచ్చు.ట్రాఫిక్ రూల్ని పాటిద్దాం- రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం,అనే నినాదంతో ప్రస్తుత రహదారి భద్రతా మాసోత్సవం ఏర్పాటు చేయనైనది.అమూల్యమైన ప్రజల ప్రాణాలను కాపాడి, ప్రమాదరహిత బంగారు తెలంగాణ కొరకు అందరం కలిసి శ్రమిద్దాం".రహదారి ప్రమాదాలను నివారించడం ఎలా?డ్రైవింగ్ ఒక వ్యక్తిగత అనుభవంగా కాక సామాజిక బాధ్యతగా వాహనం నడిపేవారందరూ గుర్తించాలి. రహదారి భద్రతా నియ లను సక్రమంగా పాటించడమే రహదారి ప్రమాదాల నివారణకు ముఖ్యమైన మార్గం, అందుచేత, వాహనాల యజమానులు, డ్రైవర్లు, విద్యార్ధులు, ఉద్యోగస్తులు మరియు ఇతర ప్రజానీకము రహదారి భద్రాతా నియమాలను పాటించి ప్రమాదాలను నివారించండి..ఈ కార్యక్రమంలో ఎం.వి.ఐ రాములు, రమేష్ ఏవో, ఓంకార్ అసిస్టెంట్, గోవిందు హోంగార్డ్ , తదితరులు పాల్గొన్నారు.