అప్పల నర్సయ్య సేవలు అభినందనీయం"
ఎస్సి,ఎస్టి,బిసి నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర చైర్మన్ శొంఠి కామేశ్వర్రావు
జనం న్యూస్ 04 సెప్టెంబర్
విజయనగరం టౌన్
గోపికృష్ణ పట్నాయక్(రిపోర్టర్) విజయనగరంలోని వెనుకబడిన తరగతి విద్యార్ధుల వసతి గృహం సహాయకునిగా గణనీయమైన సేవలందించి ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన సుందర అప్పలనరసయ్యను సంఘ భవనంలో సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కామేశ్వర్రావు మాట్లాడుతూ అప్పలనరసయ్య తన ఉద్యోగ కాలంలో ఒక్క ఆక్షేపణ లేకుండా విద్యార్ధుల పట్ల ప్రేమానురాగాలు సహాయధోరణితో కొనసాగారన్నారు. అప్పలనరసయ్య ఎస్సి,ఎస్టి,బిసి నాల్గవ తరగతి ఉద్యోగుల రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, జిల్లా సంఘ కార్యదర్శిగా, ఎపిజెఇసి జిల్లా గౌరవాధ్యక్షునిగా మరువలేని సేవలందిస్తున్నారన్నారు. రాష్ట్ర ఎస్సి,ఎస్టి,బిసి సంక్షేమ శాఖల సంఘం గౌరవాధ్యక్షులు ఎమ్.ఆంబ్రోస్ మాట్లాడుతూ సేవాభావంగల అప్పలనరసయ్య వంటి నాయకులు సంఘానికి మరింత బలాన్ని చేకూరుస్తున్నారన్నారు.భోగాపురం జడ్పిటిసి సభ్యులు శ్రీనివాసరావు, టిడిపి నాయకులు కొండపల్లి కొండబాబు, ఆర్.కె.సింహాచలం, హాస్టల్స్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పి.గౌరీప్రసాద్, బిసి వెల్ఫేర్ ఆఫీస్ సూపరింటిండెంట్ కె.ఆదినారాయణ భక్తి ప్రవచకుడు ఆర్.బి. రామానాయుడు ప్రభృతులు పాల్గొని అప్పల నరసయ్య సేవలను కొనియాడి అభినందించారు. యాగంటిరవి సన్మానపత్రాన్ని సమర్పించారు.