పోక్సో కేసులో నిందితులకి 3సం.ల కఠిన కారాగారం

పోక్సో కేసులో నిందితులకి 3సం.ల కఠిన కారాగారం

- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 09 జనవరి 
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం మహిళా పోలీసు స్టేషన్లో 2021 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితులు విజయనగరం పట్టణానికి చెందిన (ఎ-1) కోడూరు విజయకుమార్ (36 సం.లు), (ఎ-2) కోడూరు శైలజ (32 సం.లు)కుపోక్సో ప్రత్యేక న్యాయమూర్తి శ్రీమతి కే. నాగమణి గారు 3సం.ల కఠిన కారాగార శిక్ష మరియు రూ.2,500/-లుజరిమానా విధిస్తూ జనవరి 8న తీర్పు వెల్లడించినట్లుగా విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనవరి 8న తెలిపారు.వివరాల్లోకి వెళ్ళితే.. విజయనగరం పట్టణం విటి అగ్రహారం బిసి కాలనీకి చెందిన 13 సంవత్సరాల మైనరుబాలిక తల్లిదండ్రులు గొడవపడి విడిపోయినట్లు, తరువాత తన తల్లి విజయనగరం పట్టణం గాడీఖానా రైల్వే క్వాటరులో నివాసం ఉంటున్న నిందితుడు కోడూరు విజయ కుమార్ (36 సం||లు) అనే వ్యక్తితో ఉంటున్నట్లు, అప్పటి నుండి మైనరు బాలిక విటి అగ్రహారం బిసి కాలనీలో ఉంటున్న అమ్మమ్మ దగ్గర ఉంటూ చదువుకుంటున్నట్లు, తరువాత అమ్మ ఒడి  డబ్బులు విషయమై విజయనగరం రైల్వే క్వాటర్సులో ఉంటున్న తల్లి కోడూరు శైలజ ఇంటి దగ్గరకు వెళ్ళినట్లు,అదే సమయంలో మారటి తండ్రి అయిన నిందుతుడు (ఎ-1) కోడూరు విజయ కుమార్ (36 సం||లు) సదరు బాలికను లైంగికంగా వేధించినట్లు, దానికి తన తల్లి (ఎ-2) కోడూరు శైలజ (32 సం||లు) ప్రోత్సహించినట్లు, బాలిక విజయనగరం మహిళా పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయగా, అప్పటి ఎస్ఐ పి.శ్యామలాదేవి పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, నిందితులను అరెస్టు చేసి, అభియోగ పత్రం దాఖలు చేసారని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రాసిక్యూషను పూర్తి అయ్యే విధంగా మహిళా పిఎస్ సిఐ ఈ.నర్సింహమూర్తి చర్యలు చేపట్టగా,నిందితులు (ఎ-1) కోడూరు విజయ కుమార్ (36సం.లు) మైనరు బాలికపై లైంగిక దాడికి పాల్పడి వేధించినట్లు, దీనికి(ఎ-2) కోడూరు శైలజ (32 సం||లు) సహకరించినట్లుగా నేరం రుజువు కావడంతో విజయనగరం స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు శ్రీమతి కె.నాగమణి గారు నిందితులకి 3సం.లు కఠిన కారాగారం, రూ.2,500/-ల జరిమానా విధిస్తూతీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. కేసు కోర్టులో విచారణలో ఉండగా బాధితురాలు (మైనరు బాలిక) మృతి చెందినప్పటికీ నిందితులపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసువారి తరుపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటరుమెట్ట ఖజానారావు వాదనలు వినిపించగా, మహిళా పోలీసు స్టేషన్ సిఐ ఈ. నర్సింహమూర్తి పర్యవేక్షణలో మహిళా పిఎస్ కోర్టు కానిస్టేబుల్ జి.ఎస్.నాయుడు, సి.ఎం.ఎస్. హెడ్ కానిస్టేబులు సిహెచ్. రామకృష్ణ సాకులను కోర్టులో హాజరుపర్చార
న్నారు. పోక్సో కేసులో త్వరితగతిన నిందితులకిశిక్ష పడే విధంగా వ్యవహరించిన దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు.