ఎస్పీతో నూతన సీఐ లక్ష్మణరావు భేటీ
జనం న్యూస్ 01 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ను విజయనగరం రూరల్ సర్కిల్ నూతన సీఐ లక్ష్మణరావు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సీఐగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఎస్పీ ను కలిసి పరిచయం చేసుకున్నారు. సర్కిల్ పరిధిలో ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని ఎస్పీ సూచించారు. షెడ్యూల్ ప్రకారం డైనమిక్ వాహన తనిఖిలు చేపట్టాలని కోరారు.