పొట్టి శ్రీరాములు త్యాగం అజరామరం
జనం న్యూస్ 16 డిసెంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ప్రాణత్యాగం చేసిన స్వతంత్ర సమరయోధుడు, అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం అజరామరమని జిల్లా గ్రంథాలయ సేవా సంఘం ఉపాధ్యక్షులు కె.దయానంద్, వ్యవస్థాపకులు అబ్దుల్ రవూఫ్ లు కొనియాడారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్బంగా ఆదివారం కన్యాకాపరమేశ్వరి ఆలయం ముందున్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలుగు మాట్లాడేవారందరికి ఒకే రాష్ట్రం ఉండాలని కోరుతూ 58 రోజులపాటు ఆమరణ దీక్ష చేపట్టి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని, ఆయన త్యాగ ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని అంతేకాకుండా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటుకు ఆయన కారణమయ్యారని అన్నారు. గాంధీ భోదించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ కోసం పొట్టి శ్రీరాములు జీవితాంతం కృషి చేసారని, అహింసా మార్గంలోనే దీక్ష చేపట్టారని ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.