శాస్త్ర చికిత్స అనంతరం కోరుకుంటున్న యూట్యూబర్ శ్రీనివాస్:- పరామర్శించిన సండ్ర

శాస్త్ర చికిత్స అనంతరం కోరుకుంటున్న యూట్యూబర్ శ్రీనివాస్:-  పరామర్శించిన సండ్ర

(జనం న్యూస్) జనవరి 10 కల్లూరు మండల రిపోర్టర్: పట్టణంలోని సంకల్ప హాస్పిటల్ నందు గత 8 రోజులు నుంచి హార్ట్ ఎటాక్ తో బాధపడుతూ ట్రీట్మెంట్ చేసుకుంటున్న ఎస్ న్యూస్ యూట్యూబర్ ఇస్నపల్లి శ్రీనివాసు ను సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్రా వెంకట వీరయ్య చరవాణి ద్వారా పరామర్శించినట్లు ఏఎంసి మాజీ వైస్ చైర్మన్ కాటమనేని వెంకటేశ్వరరావు తెలిపారు. అతని అనారోగ్య దృష్ట్యా ఎప్పటికప్పుడు అతని ఆరోగ్య పరిస్థితిలు తెలుసుకొని సూచనలు సలహాలు ఇస్తున్న మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య.అన్నారుగూడెం విసనపల్లి శ్రీనివాస్ జనవరి నాల్గవ తారీఖున అనారోగ్యంతో ఖమ్మం సంకల్ప హాస్పిటల్ యందు ట్రీట్మెంట్ కొరకు జాయిన్ అవడంతో అక్కడి వైద్యులు అన్ని పరీక్షలు చేసి హార్ట్ ప్రాబ్లమ్ అని తెలియజేసినారు. వారు వెంటనే   ఆపరేషన్ చేయిస్తేనే బతుకుతాడు లేదంటే పరిస్థితి చాలా విషమంగా ఉన్నదని తెలియజేసినారు అదే క్రమంలో  వెంటనే ప్రఖ్యాత డాక్టర్ గంగరాజు, డాక్టర్ సీతారాం ఆధ్వర్యంలో ఆపరేషన్ చేసి వారిని ప్రాణాపాయము నుంచి కాపాడినారు. ఈ విషయమై స్థానిక మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అతని ఆరోగ్య పరిస్థితి డాక్టర్లతో అదే విధంగా శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో  చరవాణి ద్వారా ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటూ అతను తొందరగా కోలుకోవాలని కోలుకుంటారని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన సండ్ర. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ న్యూస్ యూట్యూబరు శ్రీనివాస్ కోలుకొని త్వరలోనే ఇంటికి వెళ్లాలని కుటుంబ సభ్యులకు అందరితో సంతోషంగా ఉండాలి అని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు అని కాటంనేని తెలియజేసినారు.