విశేష ఫలప్రదం ఉత్తరద్వార దర్శనం
ధనుర్మాసంలో మకర సంక్రమణానికి ముందు వచ్చే ఏకాదశిని ‘ముక్కోటి ఏకాదశి’గా పిలుస్తారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని, అందువలన దీన్ని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. వైకుంఠానికి ఉత్తరదిశలో ఉన్న ద్వారం తెరుచుకోగానే శ్రీ మహావిష్ణువును చూడటానికి ఈ రోజున మూడుకోట్లమంది దేవతలు ఎంతో ఆత్రుతతో అక్కడ వేచిఉంటారని, అందువలన దీన్ని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారని పురాణ గ్రందాలు చెబుతున్నాయి.విశేష ఫలప్రదం ఉత్తరద్వార దర్శనందర్శనమీయనున్న మహావిష్ణువు పలు దేవాలయాల్లో ఏర్పాట్లుఏపి స్టేట్ బ్యూరో చీఫ్ , ఒంగోలు (కల్చరల్), జనవరి 10 (జనంన్యూస్):ధనుర్మాసంలో మకర సంక్రమణానికి ముందు వచ్చే ఏకాదశిని ‘ముక్కోటి ఏకాదశి’గా పిలుస్తారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని, అందువలన దీన్ని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. వైకుంఠానికి ఉత్తరదిశలో ఉన్న ద్వారం తెరుచుకోగానే శ్రీ మహావిష్ణువును చూడటానికి ఈ రోజున మూడుకోట్లమంది దేవతలు ఎంతో ఆత్రుతతో అక్కడ వేచిఉంటారని, అందువలన దీన్ని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారని పురాణగ్రందాలు చెబుతున్నాయి. ఇక అనేకమంది ఈ రోజున ‘ఏకాదశి వ్రతాన్ని’ ఆచరిస్తారు. అంటే ఈ రోజంతా ఉపవాసం ఉండి, జాగరణ చేసి, హరినామ సంకీర్తన చేస్తారు. మరుసటి రోజైన ద్వాదశి రోజు ఉదయమే వ్రతాన్ని ముగించి భోజనం చేస్తారు.ఇక ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి రోజు ఉదయాన్నే శ్రీ మహావిష్ణువును దర్శించుకోవటానికి అర్ధరాత్రినుంచే పలు వైష్ణవాలయాల ముందు బారులుతీరి, హరినామస్మరణ చేస్తూ భక్తులు వేచి ఉంటారు. ఇందుకోసం అర్ధరాత్రి సమయానికే స్నానాదులు ముగించుకుని వందలాది మంది భక్తులు దేవాలయాలకు రావటం ప్రతి సంవత్సరం మనకు కనిపిస్తుంటుంది. సంవత్సరమంతా మూసి ఉండే దేవాలయ ఉత్తర ద్వారాన్ని ఈ ఒక్కరోజు మాత్రమే తెరుస్తారు. ఈ ఉత్తరద్వారంలో సర్వాలంకరణభూషితుడైన స్వామి వారిని దర్శించుకోవటానికి భక్తులకు ఈ రోజు అవకాశం కల్పిస్తారు.ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లుప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ముక్కోటి ఏకాదశి రోజున స్వామి వారిని దర్శించుకోవటానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఇటు జిల్లాలోని పలు వైష్ణవాలయాలలో, ఒంగోలు నగరంలోని పలుదేవాలయాల్లో ‘ఉత్తర ద్వారదర్శనానికి’ తగిన ఏర్పాట్లను దేవాలయ పాలకమండలి, అధికారులు పూర్తిచేశారు.జిల్లాలోని పలు వైష్ణవ దేవాలయాలతో పాటు, జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో ప్రధానంగా కేశవస్వామిపేటలోని శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామి దేవస్థానంలో స్వామి వారి ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లను ఏర్పాటుచేశామని కార్యనిర్వహణాధికారి ఆర్.శివశంకర్ తెలిపారు. ఇక మరొక ప్రధాన వైష్ణవాలయమైన శ్రీగిరి వేంకటేశ్వర స్వామి దేవస్థానంలోను వైకుంఠవాసుని ఉత్తరద్వార దర్శనం కోసం విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరి ఝాన్సీరాణి తెలిపారు. ఈ సంవత్సరం నూతనంగా ప్రవేశపెట్టిన శీఘ్రదర్శనానికి విశేష స్పందన లభించిందని ఆమె తెలిపారు. ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో శ్రీగిరి దేవస్థానానికి ముక్కోటి ఏకాదశి రోజున భక్తులు వస్తున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరు స్వామి వారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా దక్షిణం బజారు శ్రీ కోదండరామాలయం, గాంధీరోడ్డు శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం, రామ్‌నగర్‌లోని శ్రీ సీతారామాలయం, గడియారం వారి వీధి శ్రీ అనంత కోదండరామస్వామి దేవస్థానం, పోలీస్ క్వార్టర్స్‌లోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఇలా వివిధ ప్రాంతాల్లోని వైష్ణవాలయాల్లో సైతం ఉత్తరద్వార దర్శనానికి ఏర్పాట్లు జరిగాయి.ఇక కొత్తపట్నం బస్టాండు రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, కేశవస్వామిపేట విజయదుర్గా దేవస్థానం, సంతపేట, లాయర్‌పేటలోని సాయిబాబా మందిరం, సుందర నగర్ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం తదితర ఆలయాలలో సైతం ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.