8వ వార్డులో నూతన బోరును ప్రారంభించిన : కమిషనర్ వేణుబాబు
జనం న్యూస్ జనవరి 9 (మాచర్ల) :- గత కొంతకాలంగా మాచర్ల పట్టణంలోని 8వ వార్డులో ప్రజలు తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న టిడిపి సీనియర్ నాయకులు మద్దిగపు చిన్న వెంకట్రామిరెడ్డి, మద్దిగపు శ్రీనివాసరెడ్డి వెంటనే మున్సిపల్ కమిషనర్ వేణుబాబు దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే కమిషనర్ వేణుబాబు 8 వ వార్డులో పర్యటించి మంచినీటి సమస్యను గుర్తించి ప్రజల ఇబ్బంది పడకుండా ఉండేందుకు వెంటనే బోరు వేయించి ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేశారు. గురువారం నూతన బోరును ప్రారంభించిన కమిషనర్ వేణుబాబు, ఈ సందర్భంగా కమిషనర్ వేణుబాబు మాట్లాడుతూ మున్సిపల్ కుళాయిల నుంచి వచ్చే నీటిని వృధా చేస్తే సదరు కుళాయిలను డమ్మీ చేస్తామని తెలిపారు. మున్సిపాలిటీ చైర్మన్ పోలూరి నరసింహారావు మాట్లాడుతూ వార్డులో సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు మద్దిగపు చిన్న వెంకట్రామిరెడ్డి, మద్దిగపు శ్రీనివాసరెడ్డి, చైర్మన్ పోలూరి నరసింహారావు పాల్గొన్నారు