17 ఏళ్ల కన్న కూతురిపై కన్నేసిన కసాయి తండ్రి.. స్నానం చేసి వస్తుంటే చీ..చీ..!
జనం న్యూస్: ప్రస్తుతం మానవ సంబంధాలు మసకబారి పోతున్నాయి. తల్లి, చెల్లి,కూతురు అనే వావి వరసలు లేకుండా కొంతమంది మగాళ్లు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. క్షణికావేశంలో చేసిన పనులకు జైలు పాలవుతున్నారు లేదంటే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అలాంటి ఓ ఘటన గురించి ఇప్పుడు చూద్దాం.. ఒరిస్సాకు చెందిన జయశ్రీ నాయక్ అనే మహిళకు ఒక వ్యక్తితో వివాహం జరిగింది. వారి కూతురు (17)సంవత్సరాలు. అయితే జయశ్రీ నాయక్ తన భర్తతో గొడవల వల్ల మేడ్చల్ జిల్లాలోని కండ్ల కోయలో నివాసముంటోంది. ఈతరణంలోనే ఆమెకు పద్మనాభ నాయక్ అనే వ్యక్తితో మూడు నెలల కింద పరిచయం ఏర్పడింది. ఇద్దరు తరచూ కలిసేవారు. ఇది కాస్త అక్రమ సంబంధం గా మారింది. తరచూ పద్మనాభం జయశ్రీ ఇంటికి వచ్చేవాడు. ఇంట్లో వారి కూతురు కూడా ఉంది. అయితే ఓ రోజు జయశ్రీ పని మీద బయటకు వెళ్ళింది. అప్పుడే ఫుల్ గా మద్యం తాగిన పద్మనాభం నాయక్ జయశ్రీ ఇంటికి చేరుకున్నాడు. అప్పుడే జయశ్రీ కూతురు స్నానం చేసి వచ్చి బట్టలు మార్చుకుంటుంది. ఒంటరిగా ఉన్న ఆమెపై పద్మనాభం నాయక్ కన్నేశాడు. ఒక్కసారిగా వరుసకు కూతురైన ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఆ యువతి సవతి తండ్రికి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అయినా వినని ఆ దుర్మార్గుడు బాలికను గట్టిగా పట్టుకొని బలాత్కారం చేయబోయాడు. దీంతో బాలిక అతన్ని తోసేసి పక్కనే ఉన్న కర్రతో తలపై బలంగా కొట్టింది. ఈ ఘటనలో పద్మనాభం తీవ్రంగా గాయపడి పడిపోయాడు. ఇక మధ్యాహ్న సమయంలో ఇంటికి వచ్చిన జయశ్రీ రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించింది. పద్మనాభం చికిత్స పొందుతూ మరణించాడు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.