1వ ప్రపంచ ధ్యాన దినోత్సవమును నిర్వహించిన బ్రహ్మా కుమారీస్
జనం న్యూస్; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; డిసెంబర్ 22 ఆదివారం;సమాజంలోని ప్రస్తుత మానసిక ఒత్తిడిల జీవితంలో అంతరిక శాంతికి ధ్యానం ఎంతో అవసరం అని గ్రహించి ఐక్యరాజ్యసమితి డిసెంబర్ 21వ తేదీని
తొలి ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించింది,ఈ సందర్భంగా సిద్దిపేట పట్టణం శివాజీ నగర్ లోని బ్రహ్మాకుమారీస్ ఆధ్వర్యంలో 1వ ప్రపంచ ధ్యాన దినోత్సవ కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట పట్టణంలోని ప్రతిమ జూనియర్ కళాశాల లోని నర్సింగ్ విద్యార్థులకు, మరియు పెద్ద కోడూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మెడిటేషన్ యొక్క లాభాలని వివరిస్తూ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులందరి చేత మెడిటేషన్ చేయించారు, అనంతరం సంస్థ నిర్వాహకురాలు బి కే భవాని మాట్లాడుతూ ఇప్పుడున్న బిజీ లైఫ్ లో పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ ఒత్తిడి, అశాంతి, మానసిక రుగ్మతల ద్వారా ఎంతగానో బాధపడుతున్నారని ఇలాంటి సమయంలో బ్రహ్మాకుమారీస్ వారు ఉచితంగా మెడిటేషన్ క్లాసెస్ ను నిర్వహిస్తున్నారని, ఈ మెడిటేషన్ ద్వారా ఎంతోమంది లాభాన్ని పొంది తమ జీవితాలని సుఖసంతోషాలతో గడుపుతున్నారని, సిద్దిపేట ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ప్రతిమ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి ,వారి సిబ్బంది మరియు పెద్ద కోడూరు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు సంస్థ ప్రతినిధి బి కే స్వప్న, బి కే ఓంకార్,రిటైర్డ్ ఇంగ్లీష్ టీచర్ కే. అమరేందర్ రెడ్డి , బి కే. కరుణ తదితరులు పాల్గొన్నారు.