'పాఠశాలల్లో అన్యమత వేడుకల నిర్వహణపై వినతి'
జనం న్యూస్ 22 డిసెంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
అత్యధికంగా హిందూ విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో ఈనెల 25న జరగబోయే అన్యమత ఉత్సవాలను నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని భజరంగ్ దళ్ జిల్లా సయోజక్ అమర రామ కృష్ణ డిమాండ్ చేశారు. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డిఈఓ యు.మాణిక్యం నాయుడిని కలసి వినతిపత్రం అందజేశారు.స్కూళ్ళలో అన్య మతస్తులు ఉత్సవాల పేరుతో వేడుకలు నిర్వహిస్తూ మతమార్పిడిలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.