ఇప్పటివరకు 247 మందిని అరెస్ట్ చేశాం:విజయనగరం SP?
జనం న్యూస్ 22 డిసెంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
ఇప్పటి వరకు జిల్లాలో గంజాయి అక్రమ రవాణకు పాల్పడుతున్న వారిపై మొత్తం 81 కేసులు నమోదు చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.గంజాయి కేసుల్లో 247 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 2152.139 కిలోల గంజాయి, 0.78 గ్రాముల నల్లమందు, 29 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీటి విలువ రూ.1,02,30,415 ఉంటుందన్నారు.