వివేకానంద లో గణితదినోత్సవ వేడుకలు

వివేకానంద లో గణితదినోత్సవ వేడుకలు

జనం న్యూస్ ;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; డిసెంబర్ 22 ఆదివారం; సిద్ధిపేట పట్టణం భరత్ నగర్ లోని వివేకానంద విద్యాలయంలో గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఇందులో భాగంగా విద్యార్థులు గణిత ఎక్సిబిట్లు ప్రదర్శించారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థిని,విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపాల్ యాళ్ల భాస్కర్ రెడ్డి బహుమతులు అందజేసారు.ఈ కార్యక్రమములో కరస్పాండెంట్ లిఖిత,ఉపాద్యాయినులు వాణిశ్రీ,రత్నమాల,జెరెనా,దేవిక,కావేరి,భారతి,లావణ్య తదితరులు పాల్గొన్నారు.