41 రోజులు దీక్షతో శబరిమళ బయలుదేరిన అయ్యప్ప స్వాములు.....

41 రోజులు దీక్షతో శబరిమళ బయలుదేరిన అయ్యప్ప స్వాములు.....

చెన్నాపూర్ నుండి పయనమైన అయ్యప్ప స్వామి దీక్షధరులు....

 జనం న్యూస్ డిసెంబర్9.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్ మండలంలోని చెన్నాపూర్ గ్రామంలో అయ్యప్ప స్వామి మాలధారణ పొందిన అయ్యప్ప స్వాములు తాము స్వీకరించిన అయ్యప్ప మాలను  నియమ నిష్ఠలతో, కఠోర దీక్షతో అయ్యప్ప మాల మండలాన్ని పూర్తి చేసుకున్న చెన్నాపూర్ అయ్యప్ప స్వాములు కేరళ రాష్ట్రంలోని శబరిమళ ఆలయానికి సోమవారం బయలుదేరి వెళ్లారు. గోలిపల్లి మురళీధర్ రెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో ఇరుముడులు కార్యక్రమం నిర్వహించగా అయ్యప్ప గురుస్వాములు బోల్ల బిక్షపతి, మామిడి నర్సారెడ్డి, బోల్ల ఆంజనేయులు, ఎరుకలి బిక్షపతి ఆధ్వర్యంలో ఇరుముడులతో శబరిమళ యాత్రకు చెన్నాపూర్ అయ్యప్ప స్వాములు పయనమయ్యారు. చెన్నాపూర్ అయ్యప్ప స్వాములతో పాటు తిమ్మాపూర్ ప్రసాద్, నర్సిములు, సాయి గురుస్వామి తదితరులు శబరి గురుషుని దరర్శనానికి అయ్యప్ప స్వాములు వెళ్లడం జరిగినది.