శివ్వంపేటలో ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

శివ్వంపేటలో ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు  కొడకంచి శ్రీనివాస్ గౌడ్ సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం...

 పోటా పోటీగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు..

 జనం న్యూస్ డిసెంబర్9.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు సోమవారం మండల కేంద్రమైన శివ్వంపేటలో ఘనంగా జరిగాయి. మండల కాంగ్రెస్ నాయకులు వేర్వేరుగా సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను పోటా పోటీగా నిర్వహించడం జరిగినది.
@ కొడకంచి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సోనియా చిత్రపటానికి పాలాభిషేకం.. @కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు కొడకంచి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం సోనియా గాంధీ పుట్టినరోజు సందర్బంగా బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. సోనియా చిత్రపటానికి నాయకులు పాలాభిషేకం నిర్వహించి, సోనియా గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈసందర్బంగా కేకు కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు అనంతరం నర్సాపూర్ కు బయలుదేరారు.@ పులిమామిడి నవీన్ గుప్త ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు.. @ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు సోమవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులిమామిడి నవీన్ గుప్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోనియాగాంధీ పుట్టినరోజు సందర్బంగా పటాకుల కాల్చి, కేకు కట్ చేసి సంబరాలు నిర్వహించడం జరిగినది. ఈసందర్బంగా తెలంగాణ చిరకాల వాంఛ ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ఏర్పాటు కోసం సోనియాగాంధీ    సంపూర్ణ సహకారాలను అందించిందని కొనియాడారు. ఈకార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.