*ఖేడ్ ప్రభుత్వ వైద్యశాలకు రెండు వీల్ చేర్లను అందించిన లైన్స్ క్లబ్*

*ఖేడ్ ప్రభుత్వ వైద్యశాలకు రెండు వీల్ చేర్లను అందించిన లైన్స్ క్లబ్*

*లైన్స్ క్లబ్ అధ్యక్షులు వెంకట్ రావు, చంద్రశేఖర్ ఆచార్య,*

జనం న్యూస్,జనవరి 07,కంగ్టి    

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని స్థానిక ఏరియా ప్రభుత్వ వైద్యశాలలో వైద్యశాల సూపరిండెంట్ డాక్టర్ రమేష్,ప్రతి ఒక్కరు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని అన్నారు.అందుకు దాతృత్వ గుణాన్ని పెంపొందించుకోవాలని  అన్నారు.మంగళవారం శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, సూచనల మేరకు లైన్స్ క్లబ్ వెంకట్రావు, చంద్రశేఖర్ ఆచార్య, రాజ్ కుమార్, ఆధ్వర్యంలో రెండు వీల్ చేర్లను ప్రభుత్వ వైద్యశాలకు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సరిహద్దు ప్రాంతమైన ఖేడ్ నియోజకవర్గంలో నిరుపేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉపయుక్తంగా ప్రభుత్వ వైద్యశాల ఉందని అన్నారు. వైద్యశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. సోమవారం జరిగిన హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశంలో వైద్యుల విన్నపం మేరకు వైద్యశాలలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో   మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి జరుగుతుందని అన్నారు.అందులో భాగంగానే ప్రస్తుతం రెండు వీల్ చేర్లను అందించడం జరిగిందని అన్నారు.రాబోయే రోజుల్లో మరిన్ని మౌలిక వసతులను ఎమ్మెల్యే అందించనున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ సభ్యులు రాజ్ కుమార్, నాయకులు శంకర్ ముదిరాజ్,వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.