గ్రామపంచాయతీ కార్మికులందరిని పర్మినెంట్ చేయాలి

గ్రామపంచాయతీ కార్మికులందరిని పర్మినెంట్ చేయాలి

సీఐటీయూ మెదక్ జిల్లా అధ్యక్షులు ఎ. మహేందర్ రెడ్డిడిమాండ్....


2వ పీఆర్సీ పరిధిలోకి గ్రామపంచాయతీ కార్మికులను తీసుకురావాలని మహేందర్ రెడ్డి డిమాండ్..

 జనం న్యూస్ డిసెంబర్16.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్నిత్యం గ్రామాలలో ఎన్నో రకాలుగా సేవలందిస్తూ,అరకొర వేతనాలతో గ్రామాల పరిశుభ్రతకు పాటు పడుతున్న గ్రామపంచాయతీ కార్మికులందరిని వెంటనే పర్మినెంట్ చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎ. మహేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికులతో కలిసి సోమవారం ఎంపీఓ తిరుపతిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈసందర్బంగా మహేందర్ రెడ్డి   మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచడంతో పాటు జీఓ నెం 51ని సవరణ చేస్తూ, మల్టిపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఎన్నో రోజులుగా పెండింగ్ లో ఉన్న గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలను చెల్లించాలని,వేతనాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి, గ్రీన్ ఛానెల్ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.2వ పీఆర్సీ పరిధిలోకి గ్రామపంచాయతీ కార్మికులను తీసుకువచ్చి జీఓ 60 ప్రకారం కేటగిరిల వారిగా వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. జిపి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు రిటైర్డ్ మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు చెల్లించాలని, ఇన్స్ రెన్స్, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కూడ కల్పించాలని మహేందర్ రెడ్డి  డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు గ్రామపంచాయతీ కార్మికులకు ఇంటి స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికుల సంఘం నాయకులు కిచ్చనోళ్ల నర్సిములు, వసంత, అశోక్, తదితరులు పాల్గొన్నారు.