తడ్కల్ ముడవ అంగన్వాడీ కేంద్రంలో ఈ సి సి డే
అంగన్వాడీ టీచర్ ప్రేమల
జనం న్యూస్,డిసెంబర్ 28,కంగ్టి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ ముడవ అంగన్వాడీ కేంద్రంలో శనివారం టీచర్ ప్రేమల ఆధ్వర్యంలో చిన్నారుల సంరక్షకులతో ఈ సి సి డే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా టీచర్ మాట్లాడుతూ ఫ్రీ స్కూల్ కార్యక్రమం పట్ల తల్లులకు పూర్తి అవగాహన కల్పించారు. అంగన్వాడి కేంద్రంలో పోషక విలువలతో కూడిన పౌష్టిక ఆహారాన్ని అందించడం జరుగుతుందని అన్నారు.చిన్నారులకు ఆటపాటలతో చక్కని విద్యను బోధిస్తామని అన్నారు.అంగన్వాడి కేంద్రంలో 2.5 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలకు చేర్పించాలని సంరక్షకులకు క్షుణ్ణంగా వివరించారు. అంగన్వాడీ కేంద్రంలో చేర్పించిన చిన్నారులకు విద్యతోపాటు, పౌష్టికాహారం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ నిర్మల,ఆయమ్మ లలిత,సవిత,సాయవ్వ,అనిత,రామవ్వ, నరసవ్వ,నాగమణి, చిన్నారులు పాల్గొన్నారు.