ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన జయప్రదం చేయండి- బుద్ధ నాగ జగదీష్

ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన జయప్రదం చేయండి- బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ జనవరి 7 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్య ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ కృషి ఫలితంగా అనకాపల్లి జిల్లాలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు శంకుస్థాపనకు విచ్చేస్తున్న నరేంద్ర మోడీ బహిరంగ సభకు విజయవంతం చేయవలసిన బాధ్యత కూటమి శ్రేణులపై ఉందని మాజీ శాసనమండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు ఈరోజు పార్లమెంట్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనకాపల్లి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ కృషి ఫలితంగా అచ్యుతాపురం సేజ్ లో ఈఎస్ఐ హాస్పిటల్ మూడు కేంద్రీయ విద్యాలయాలు మంజూరు కి కేంద్రంతో పోరాడి సాధించారని నాగ జగదీష్ అన్నారు. పాయకరావుపేట నియోజకవర్గం లో నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద 2685 ఎకరాలలో ఆర్సిలర్ జపాన్ సంస్థ నిప్పన్ సహకారంతో ఉక్కు కర్మాగారం 1,65,000 లక్షల కోట్ల రూపాయలతో ఉక్కు కర్మాగారం రాబోతుందని దీని మూలంగా 50 వేల మందికి ఉద్యోగ అవకాశాలు పరోక్షంగా ఉపాధి అవకాశాలు వస్తాయని, ముఖ్యంగా పూడిమడక వద్ద 1,85,000 ఎన్ టి పి సి సహకారంతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రభుత్వ రంగంలో రాబోతుందని, విభజన చట్టంలో విశాఖ రైల్వే జోన్ ఇచ్చిన హామీ ప్రకారం 54 ఎకరాల భూముల రైల్వే జోన్ కి జనవరి 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సమక్షంలో శంకుస్థాపన కార్యక్రమం చేయబోతున్నారని ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి అనకాపల్లి పార్లమెంట్ నుండి 300 బస్సులలో కూటమి పార్టీ శ్రేణులు తరలి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని సభను విజయవంతం చేయవలసిందిగా నాగ జగదీష్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కుప్పిలి జగన్ వేదుల సూర్యప్రభ బోడి వెంకటరావు వేగి వెంకటరావు సాలాపు నాయుడు బర్నికాన శ్రీనివాసరావు పాల్గొన్నారు.//