మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

జనం న్యూస్ డిసెంబర్ 27 రేగోడు మండలం మెదక్ జిల్లా

రిపోర్టర్ :వినయ్ కుమార్ భారతదేశ మాజీ ప్రధాని ఆర్థిక వేత్త డా మన్మోహన్ సింగ్ అకాల మరణానికి సంతాపం ప్రకటిస్తూ రేగోడు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామపంచాయతీ కార్యాలయం నందు వారి చిత్ర పటానికి పూలమాలను వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు శంకరప్ప మాట్లాడుతూ భారతదేశ ప్రధానిగా నెహ్రూ తర్వాత వరుగా 10 ఏళ్లు ప్రధానిగా చేసిన ఘనత మన మన్మోహన్  సింగ్ ది. దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుపోతున్న సమయంలో ఆనాటి ప్రధాని పీవీ నరసింహారావు  నేతృత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించి దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు ఆయన నిజానికి ఆనాడు  చేసిన సంస్కరణలే నేటి దేశ ఆర్థిక పురోగతికి పునాదులు అని అన్నారు. అంతే కాదు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోని బడుగుబలహీనర్గాలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యత్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చిన ఘనత వారిది. ఇలాంటి మహనీయుడి కీర్తిని రానున్న తరాలకు తెలియజేస్తూ ఆశయ సాధనలో మనం అందరం నడుచుకోవాలి అని అన్నారు. ఇలాంటి మహనీయుడిని, ఆర్థికవేత్త నీ కోల్పోవడం మన దేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ పీఎస్ఎల్ చైర్మన్ శ్యామ్ రావు, ఎ ఎం సి డైరెక్టర్ గంజి రమేశ్వర్ మాజీ సర్పంచ్ మన్నే భాస్కర్, రామా గౌడ్, పి ఎస్ ఎస్ వైస్ చైర్మన్ రాధా కిషన్, పిఎసిఎస్ డైరెక్టర్ నాగేందర్రావు కులకర్ణి, కుమ్మరి నారాయణ, తదితరులు పాల్గొన్నారు.