శాస్త్రవేత్త డాక్టర్ లూయీ పాశ్చర్ సేవలు చిరస్మరణీయం.
జనం న్యూస్ 28 డిసెంబర్ 2024. విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా
సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి
డోన్ ప్రాంతీయ పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఆర్. నాగరాజు
డిసెంబర్ 27 న ప్రముఖ ఫ్రెంచి శాస్త్రవేత్త శ్రీ లూయీ పాశ్చర్ గారి జయంతి సందర్బంగాడోన్ పట్టణంలో ప్రాంతీయ పశు వైద్యశాల నందుసామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆద్వర్యం లో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఆర్. నాగరాజు అధ్యక్షతన శాస్ర్రవేత్త శ్రీ లూయీ పాశ్చర్ గారి జయంతి సందర్బంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు. వారిని స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ హుస్సేన్ భాష, డాక్టర్ కీర్తి, సిబ్బంది ఎల్ ఎస్ ఏ. మహ్మద్ రఫి, భారతి, రైతులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఆర్. నాగరాజు, సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి మాట్లడుతూమన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి పేర్కొన్నారు
శ్రీ లూయీ పాశ్చర్ (Louis Pasteur) ప్రముఖ ఫ్రెంచి జీవ శాస్త్రవేత్త. వ్యాధులకు కారణమైన సూక్ష్మక్రిములని కనుగొని రోగ నివారణకు పాశ్చర్ బాటలు వేశారు. టీకాల ఆవిష్కారానికి ఇతడు ఆద్యుడు. మొదటిసారిగా రేబిస్ వ్యాధి కోసం టీకాను తయారుచేశాడు.లూయీ పాశ్చర్ ఫ్రెంచి సూక్ష్మజీవశాస్త్రజ్ఞుడు మరియు రసాయన వేత్త .ఈయన 1822 డిసెంబరు 27 జన్మించారు.చాలా మందికి ఇతడు పాలు ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టే పద్ధతిని ప్రవేశపెట్టిన వ్యక్తిగా సుపరిచితులు. ఇతన్ని సూక్షజీవశాస్త్రం వ్యవస్థాపకులైన ముగ్గురిలో ఒకరుగా పేర్కొంటారు. మిగిలిన ఇద్దరు రాబర్ట్ కోచ్ మరియు ఫెర్డినాండ్.పిచ్చికుక్క కాటు వల్ల వచ్చే రేబీస్ వ్యాధికి మందు కనిపెట్టడం Louis పాశ్చర్ సాధించిన శాస్త్ర విజయాలలో ప్రధానాంశం. ఈ మందుతో చాలా మందిని ప్రాణాపాయం నుండి కాపాడాడు.1870 దశాబ్దంలో టీకా పద్ధతులను పశువులలో వచ్చే ఆంత్రాక్స్ వ్యాధి మీద ప్రయోగించాడు.ఈ విధంగా కొన్ని ప్రాణాంతక వ్యాధులకు సూక్ష్మక్రిములు కారణాలన్న విషయాన్ని నిరూపించాడు. అందువలన మనుషులు గాని, జంతువులు గాని అంటు వ్యాధితో మరణిస్తే ఆ శవాన్ని దహనం చేయాలని చెప్పారు. భూమిలో పాతిపెడితే శరీరంలోని క్రిములు బయటకు వచ్చి వాటివలన ఇతరులకు ఆ వ్యాధులు వ్యాపిస్తాయని వివరించారు.పాశ్చర్ సూక్ష్మజీవశాస్త్రంలో
అత్యుత్తమ గౌరవమని పిలిచే లీవెన్ హాక్ బహుమతిని 1895లో పొందారు.పాశ్చర్ తన పూర్తి జీవితాన్ని శాస్త్ర పరిశోధనలకు అంకితం చేశారు. సంకల్పబలం, నిరంతర శ్రమతో విజయాన్ని సాధించవచ్చని పాశ్చర్ విశ్వాసం. రెండు సార్లు గుండెపోటు, తరువాత పక్షవాతం వచ్చినా జీవితాంతం పరిశోధన చేసి మానవాళికి వెలకట్టలేని సేవ చేసిన పాశ్చర్ 1895 సెప్టెంబరు 28న పరమపదించారు. ఇలాంటి మహనుభావులను స్మరించుకుంటు వారి అడుగుజాడల్లో నడవాలని అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఆర్. నాగరాజు సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి కోరారు.పి. మహమ్మద్ రఫి సామాజిక కార్యకర్త డోన్