కొయ్యూరు మండల బీజేపీ నూతన అధ్యక్షులు గా సంపరి శివకుమార్

కొయ్యూరు మండల బీజేపీ నూతన అధ్యక్షులు గా సంపరి శివకుమార్

 జనం న్యూస్ జనవరి 12( కొయ్యూరు ప్రతినిధి సూపర్ స్టార్ కృష్ణ )అల్లూరి సీతారామరాజు జిల్లా 
కొయ్యురు మండలం బీజేపీ ప్రెసిడెంట్ గా సంపరి శివ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక కా బడ్డారని ఎలక్షన్ అధికారులుగా వచ్చిన జిల్లా అధ్యక్షులు పాంగి రాజారావు మరియు అసెంబ్లీ ఇంచార్జి, ట్రైకారు మెంబెర్ కూడా కృష్ణా రావు ఒక ప్రకటన విడుదల చేశారు. తేదీ 11/1/2025 శనివారం రోజు నుండి మూడు సంవత్సరాలు వరకు ఈయన ఈ పదవిలో కొనసాగుతారు.

నా శక్తి వంచన లేకుండా పార్టీ అభివృద్ధి కొరకు పనిచేస్తానని నూతన అధ్యక్షులు గా ఎన్నిక కాబడిన శివకుమార్ తెలియజేశారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్న బిజెపి కుటుంబ సభ్యులందరికీ పేరుపేరునా నా కృతజ్ఞతలు తెలియజేశారు   ఈ సందర్భంగా కొయ్యూరు మండల  బిజెపి మాజీ అధ్యక్షులు జిల్లా సహాయ కార్యదర్శి  అరిమెల రాజు లోకుల అచ్యుతవాణి గాలి దేవుడు, మేడిపోయిన చిన్న( చకర్రావు )  బిజెపి పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఏకగ్రీవంగా ఎన్నుకున్న బీజేపీ కుటుంబ సభ్యులు అందరికి పేరు పేరు న కృతజ్ఞతలు తెలియ జేశారు.