పేదలకు ఇళ్ల స్థలాల ఇస్తానన్న చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలి
-సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ.
జనం న్యూస్ 11 జనవరి
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచార సభల్లో ఇచ్చిన హామీ మేరకు స్వంత గృహం లేక అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్న నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇచ్చే భాధ్యత కూటమి ప్రభుత్వానిది అని చెప్పిన మాట నిలబట్టుకోవాలి అని సిపిఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ అన్నారు.ఇళ్లులేని నిరు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, కూటమి సర్కారు ఎన్నికల్లో ఇచ్చిన ఇళ్ల స్థలాల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యునిస్టు పార్టీ (సిపిఐ) నియోజకవర్గ కార్యదర్శి బుగత అశోక్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం విజయనగరం తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, ఇళ్ల స్థలాలకు నీలా కూర్మనాథ్ గార్కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఒమ్మి రమణ మీడియాలో మాట్లాడుతూ ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇళ్ళు లేని పేదలకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు,గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలాలు కేటాయిస్తామన్న వాగ్దానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన జగనన్న నివేశనా స్థలాల లబ్ధిదారులకు పట్టణాల్లో సెంటుకు బదులుగా రెండు సెంట్లు,గ్రామాల్లో సెంటున్నరకు బదులు మూడు సెంట్లు ఇస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ నెరవేర్చాలని కోరారు.అలాగే గృహ నిర్మాణానికి 5 లక్షలు రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు ఎ రాములు, బూర వాసు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.