మందు తాగి అందరూ చూస్తుండగా..బట్టలు విప్పేసి రచ్చ చేసిన యువతి.. (వీడియో చూడండి).
జనం న్యూస్: మద్యం మత్తులో ఓ యువతి రెచ్చిపోయింది. ఏకంగా ఒంటిమీద బట్టలు విప్పేసి నడిరోడ్డుపై నానా రచ్చ చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఓ యువతి స్థానిక క్లబ్‌లోకి వెళ్లింది. సమయం అయిపోవడంతో సెక్యూరిటీ ఆమెను లోపలకి ఎంట్రీ లేదని అనుమతించలేదు. దాంతో ఆగ్రహించిన ఆ యువతి బౌన్సర్లతో వాగ్వాదానికి దిగింది. అయినప్పటికీ వారు ఆమెను అడ్డగించారు. దాంతో మరింత రెచ్చిపోయింది. వారిని బండ బూతులు తిడుతూ లోపలికి అనుమతించకపోతే, అందరిముందూ తన డ్రెస్ విప్పేస్తానని బెదిరించి నానా రచ్చ చేసింది. యువతి చేసని రచ్చను సెక్యూరిటీ సిబ్బంది ఫోన్లో రికార్డ్ చేశారు. అది గమనించిన యువతి.. తన అనుమతి లేకుండా వీడియో ఎలా తీస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. వారి ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించింది. ఇంతలో క్లబ్ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. అయితే, ఇంతలోనే ఆమె అక్కడి నుంచి కారులో పారిపోయింది. క్లబ్ యజమాని కరణ్ ఠక్కర్ ఫిర్యాదు మేరకు నాగ్‌పూర్‌లోని సోనేగావ్ పోలీసులు కేసు నమోదు చేశారు. యువతి మద్యం మత్తులోనే అలా రచ్చ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పారిపోయిన యువతి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇక యువతి వీరంగం వీడియో సోషల్ మీడియాకు చేరి వైరల్‌గా మారింది.