మొదటి సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసిన పి.యూ వైస్ చాన్సలర్
జనం న్యూస్ జనవరి 09
ప్రతీనిది ఎండీ జహంగీర్
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పరిధిలోని పాలెం లోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ (అటానమస్) కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థుల మొదటి సెమిస్టర్ పరీక్షా ఫలితాలను కళాశాల ప్రిన్సిపల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ పి రాములు తమ అధ్యాపక బృందం తో కలిసి గురువారం పాలమూరు యూనివర్సిటీ లో వైస్ ఛాన్సలర్ ఆద్వర్యంలో ప్రొఫెసర్ జి.ఎన్. శ్రీనివాస్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డి.చెన్నప్ప, ఓ.ఎస్.డి మధుసూధన్ రెడ్డి, ఎగ్జామినేషన్ కంట్రోలర్ డా.కె. రాజ్ కుమార్, అడిషనల్ కంట్రోలర్ శాంతి ప్రియ, విజయలక్ష్మి లు విడుదల చేశారు. అనంతరం సాయంత్రం కళాశాలలో కూడా విడుదల చేయడం జరిగింది.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కంట్రోలర్ ఎగ్జామినేషన్ డాక్టర్ రాములు మాట్లాడుతూ విద్యార్థులందరూ రెండవ సెమిస్టర్ కు అర్హత సాధించినట్లు తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను కళాశాల వెబ్ సైట్ లో చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అడిషనల్ కంట్రోలర్ శివ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పద్మజ,లైబ్రేరియన్ డాక్టర్ వర్కాల శ్రీనివాస్, అధ్యాపక బృందం డాక్టర్ నాగరాజు, డాక్టర్ సుష్మ, డాక్టర్ రాధాకుమారి, డాక్టర్ స్వప్న, డాక్టర్ నాగలింగం, వెంకటేష్, రవికుమార్, రమేష్, మనోజ్ కుమార్, ప్రకాష్, యాదగిరి, సీనియర్ అసిస్టెంట్ కవిత, అధ్యాపకేతర బృందం అక్బర్,కుర్మయ్య, బాలస్వామి, నాగేష్ తదితరులు పాల్గొన్నారు