నారాయణ స్కూల్ నందు ఘణంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు.
జనం న్యూస్ జనవరి 9 ( మాచర్ల ) :- మాచర్ల పట్టణంలోని స్ధానిక నారాయణ స్కూల్ నందు ఘణంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ పల్నాడు జిల్లా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ లక్ష్మణ్ రెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో పండుగల యెక్క వైశిష్ట్యం తెలుగు పండుగల పట్ల విద్యార్థులలో అవగాహన కల్పించడం అనే ప్రధాన ఉద్దేశ్యంతో మనం జరుపుకునే పండుగలలో అతి పెద్ద పండుగ సంక్రాంతి అని, భోగి పండ్లు అంటే రేగు పండ్లు, ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ, సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలతో కలిపి పిల్లల పై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో భోగి పండ్లు పోస్తారు అని తెలిపారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన భోగి పండ్లు కార్యక్రమంలో చిన్నారులపై భోగి పండ్లును లక్ష్మణ్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ ఉల్లారెడ్డి, సిబ్బంది పోసి వారికి దివేనలు అందచేశారు. పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల నందు గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఉల్లారెడ్డి,ఇన్చార్జి లు ఆంజనేయులు, ఉదయలక్ష్మి, సునీత, జోనల్ ఇన్చార్జి లు గౌసియా, రిహనీ, భద్రారెడ్డి.పాఠశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శివ కిరణ్ రాజు తదితర పాఠశాల సిబ్బంది విద్యార్ధిని విద్యార్ధులు మరియు వారి తల్లితండ్రులు పాల్గొన్నారు.