గిరిజనులకు ఆదాయ మార్గాలపై అవగాహన సదస్సుకి ముఖ్య అతిథిగా సి ఈ ఓ గంథం లక్ష్మి విచ్చేసి యున్నారు

గిరిజనులకు ఆదాయ మార్గాలపై అవగాహన సదస్సుకి ముఖ్య అతిథిగా  సి ఈ ఓ గంథం లక్ష్మి విచ్చేసి యున్నారు

జనం న్యూస్ జనవరి 9( కొయ్యూరు ప్రతినిధి సూపర్ స్టార్ కృష్ణ )అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం, అంతాడ గ్రామ పంచాయతీ కేంద్రంలో రేవతి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ వి ఎస్ ఆర్ ప్రసాద్ మరియు లిఫ్ట్ రూరల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ సొసైటీ గౌరవ అధ్యక్షులు వి అప్పారావు ఆధ్వర్యంలో గంధం అగ్రో ఫుడ్స్ సహకారంతో ఈ ప్రాంతంలో విరివిగా పండే జీడి పండు మరియు జీడి పిక్క ప్రొసెసింగ్ యూనిట్ నెలకొల్పడం ద్వారా రైతులకు ఆదాయం పెంచే కార్యక్రమాలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గంధం అగ్రో ఫుడ్స్ సిఇఓ గంధం లక్ష్మీ సునీత పాల్గొని అవగాహన సదస్సుపై వారి అమూల్యమైన సందేశం, మరియు సలహాలను ఇచ్చి, గిరిజన యువతకు, మహిళలకు, రైతులకు ఏవిధంగా ఆదాయ మార్గాలు పెంచుకోవచ్చు అనే విషయాలు పాడేరు నియోజకవర్గం ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు మరియు ప్రభుత్వ అధికారుల సలహాలు సూచనలతో మా వంతు సహకారం అందిస్తామని సూచించారు. ఇందులో గ్రామ మహిళలు, రైతులు, యువత పాల్గొని గంధం అగ్రో ఫుడ్స్ వారు ఇచ్చిన సలహాలను భవిష్యత్తులో పాటిస్తామని, ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుర్ల చందరరావు, మాజీ సర్పంచ్ సాలేబు సన్యాసిరావు, ఎంపిటిసి దేముడు, గంధం అగ్రో ఫుడ్స్ కో ఆర్డినేటర్ రమేష్, బిజెపి జిల్లా గిరిజన మోర్చ అధ్యక్షులు అరిమెల రాజు, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు రీమల చందరరావు, సామాజిక సేవకుడు అర్జున్ రెడ్డి, సమరసతా సేవా ఫౌండేషన్ మండల ధర్మ ప్రచారక్ సెగ్గె సన్యాసిరావు, బచ్చల లక్ష్మణరావు, మహిళలు, రైతులు, యువతీయువకులు తదితరులు పాల్గొన్నారు.