ప్రకాశం: రోడ్డు ప్రమాదాల్లో ఒకే రోజు ముగ్గురి మృతి..
జనం న్యూస్, జనవరి 07:
ప్రకాశం జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో సోమవారం ముగ్గురు మృతి చెందారు. పోలీసులు వివరాల మేరకు.. ఎదురాళ్లపాడుకులో నాగం గంగమ్మ(42) కారు ఢీకొనడంతో మృతిచెందగా, దర్శి ఓబన్నపల్లికి చెందిన కాశీనాయన రెడ్డి(24) గడ్డి ట్రాక్టర్ ఢీకొని మృతి చెందాడు. ముండ్లమూరులో సుధీర్(18) వరి కోత ర్యాంప్ ఢీకొనగా అక్కడికక్కడే చనిపోయాడు