*రాబోయే విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా నిర్దిష్టమైన చర్యలు .......*

*రాబోయే విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా నిర్దిష్టమైన చర్యలు .......*

* పెద్దపల్లి సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కంకటి మాధవరావు

* నూతనంగా 160 ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు, 74 ట్రాన్స్ ఫార్మర్ల సామర్థ్యం పెంపు

*జనం న్యూస్, డిసెంబర్ 26, పెద్దపల్లి రూరల్ ప్రతినిధి*

రాబోయే విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా నిర్దిష్టమైన చర్యలు చేపట్టామని పెద్దపల్లి సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కంకటి మాధవరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత వేసవి కాలం డిమాండ్ దృష్టిలో పెట్టుకొని రాబోయే వేసవి కాలంలో పెరగబోయే విద్యుత్ డిమాండ్ అంచనా మేరకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని, గతంలో గరిష్ట డిమాండ్ ఉన్న సమయంలో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్ (డి.టి.ఆర్) పై లోడ్ భారం ఎంత ఉందో టెస్టర్ రీడింగ్ తీసుకొని దానికి అనుగుణంగా నూతనంగా 160 ట్రాన్స్ ఫార్మర్ లు అమర్చడం జరుగుతుందని, లోడ్ ప్రకారం 74 ట్రాన్స్ ఫార్మర్ సామర్థ్యాన్ని పెంచుతున్నామని అన్నారు. 

నాణ్యమైన విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా అందించేందుకు 33కేవి ఇంటర్ లింకింగ్ లైన్ వ్యవస్థ పటిష్ట పరుస్తూ ప్రతి ఒక్క 33/11 కేవి సబ్ స్టేషన్ కు అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఫీడర్ ద్వారా విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి అవసరమైన పనులు పూర్తి చేస్తున్నామని, ఓవర్ లోడ్ ఉన్న 33కేవి, 11 కేవి ఫీడర్లను గుర్తించి లోడ్ రిలీఫ్ చేసేందుకు లోడ్ బదలాయింపు చేస్తున్నామని తద్వారా లోడ్ భారం తగ్గి నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుందని అన్నారు. విద్యుత్ అంతరాయాలు సంభవించినప్పుడు పట్టణంలో నిరంతర సరఫరా అందించేందుకు రింగ్ మెయిన్స్ వ్యవస్థను పరిష్క పరుస్తూ, 11కేవి ఫీడర్లకు అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ ఫీడర్ల ద్వారా విద్యుత్ వినియోగ దారులకు అంతరాలు లేని విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. 1273 డి.టి.ఆర్ నిర్వహణ చేపట్టామని తెలిపారు.

గత వేసవిలో ఎదుర్కొన్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని వచ్చే వేసవిలో వినియోగదారులకు మరింత మెరుగైన నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు తెలంగాణ నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లోని ప్రతి ఉద్యోగి కంకణ బద్ధులై పనిచేస్తున్నారని పెద్దపల్లి సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆ ప్రకటనలో పేర్కొ

న్నారు