పొలం పిలుస్తుంది కార్యక్రమం రైతుల అవగాహన

పొలం పిలుస్తుంది కార్యక్రమం రైతుల అవగాహన

ఓబులవారిపల్లి మండలం కొర్లకుంట RSK పరిధిలోని చలం పాలెం గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఏ డి ఏ కవిత వరిలో  ఎరువులు యజమాన్యం గురించి వివరించటం జరిగినది ఎకరాకి 10 కిలోలు జింక్ సల్ఫేట్ వరి లో వేసుకోవాలని రైతులకు తెలియజేయడం జరిగినది అడవి పందుల నుండి నివారణకు వెంట్రుకలు చుట్టు వేయాలని అదేవిధంగా టెంకాయ తాళ్ళకు సల్ఫర్ పట్టించడం గులికులు వాడటం ద్వారా నివారణ అవుతుంది భూసార పరీక్ష ఫలితాలను రైతులకు అందజేయడం ఎరువులు వాడకం గురించి తెలియజేయడం జరిగినది చెన్నరాజుపోడు RSK సోమాకులపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో జీవామృతము తెగులుకు కషాయాలు సాగు చేస్తున్న కిచెన్ గార్డెన్ ను మండల అధికారి ఏవో బి మల్లిక చూడడం జరిగినది ప్రతి ఒక్కరు కూడా మహిళ కూడా ఇంటి ఆవరణంలో సరిపడా కూరగాయలు పండించుకోవాలని మండల ఏవో వ్యవసాయ అధికారి మల్లికా తెలియజేశారు మామిడి పంటకు ఇన్సులిన్చు ఉన్నదని తెలియజేశారు ఎకరాకు 2250 చెల్లించి చేసుకోవాలని అగ్రికల్చర్ ఆఫీసర్ మల్లికా తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో వి ఏ ఏ భావన త్రివేణి ప్రకృతి వ్యవసాయం పనిచేస్తున్నఎంసీఏ బుల్లయ్య ప్రకృత వ్యవసాయ మహిళా రైతు సుంకర లక్షుమ్మ పాల్గొన్నారు.