ఓరినీ క్రియేటివిటీ పాడుగాను.. కొత్త జంట దీపావళి రాకెట్ లో ప్రయాణం..! (వీడియో చూడండి)
జనం న్యూస్: కొత్త జంట తమ వివాహాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకుంది. కాస్త డిఫరెంట్ గా ఆలోచించి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. సాధారణంగా పెళ్లి తర్వాత వధువు అప్పగింతల కార్యక్రమం ఉంటుంది కదా. దీన్ని అందరిలా కాకుండా అందరూ చెప్పుకునేలా ప్లాన్ చేసింది ఓ కొత్త జంట. ఈ అద్భుతమైన క్షణాలను కెమెరాలో బంధిస్తూ ప్రపంచం మొత్తం నవ్వుకునేలా చేసింది. క్రియేటివిటీ పేరుతో సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక కొత్తదనం కనిపిస్తూనే ఉంటుంది. ఎవ్వరూ ఊహించని ఎన్నో వీడియోలు కనిపిస్తున్నాయి. తాజాగా కొత్త జంట కూడా ఇలాగే ప్లాన్ చేసి తమ అప్పగింతలు వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేసేసింది. అప్పగింతలు జరిగిన తర్వాత సాధారణంగా వధువును కారులో లేదా ఏదన్నా వాహనంలో అత్తారింటికి తీసుకెళ్లారు. కానీ ఇక్కడ బిన్నంగా ఆలోచించారు. వరుడు పెద్ద దీపావళి రాకెట్‌తో నిలబడి ఉన్నాడు. అప్పగింతల తర్వాత అతని వెనుక వధువు కూడా కూర్చుంది. ఇంతలో వెనుక నుంచి ఓ వ్యక్తి వచ్చి నిప్పంటించాడు. ఇది జరిగిన వెంటనే, రాకెట్ టేకాఫ్ కావడం, వధూవరులు దానిపై ఎగురుతూ ఆకాశంలో విహరించడం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో @Masterji_UPWale పేరు గల X ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేశారు. కేవలం 34 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 9 లక్షల మందికి పైగా వీక్షించగా, వేల మంది లైక్ చేశారు. వీడియోను వీక్షించిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు.