ఆటో డ్రైవర్లను ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు.....

ఆటో డ్రైవర్లను ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు.....


 జనం న్యూస్ డిసెంబర్20.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్

సమస్యల పరిష్కారానికి ఆటో డ్రైవర్లు తలపెట్టిన చలో అసెంబ్లీ ముట్టడిని కట్టడి చేయడానికి శుక్రవారం శివ్వంపేటలో ఆటో డ్రైవర్లను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. శాసనసభ సమావేశాలకు విఘాతం కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తూప్రాన్ డిఎస్పీ సూచనలతో శివ్వంపేట ఎస్ఐ మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఆటో డ్రైవర్లను ముందస్తు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు అరెస్ట్ చేసిన ఆటో డ్రైవర్లలో ఎండీ చాంద్, మహేష్, లింగరాజు, ఇబ్రహీం, ప్రశాంత్, మల్లేష్, నిఖిల్, ఆంజనేయులు, తదితరులు ఉన్నారు. ఈకార్యక్రమంలో పోలీస్ హెడ్ కానిస్టేబుల్ దేవదాసు, సిబ్బంది హరిబాబు తదితరులు పాల్గొన్నారు