కేపీఎల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

కేపీఎల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

జనం న్యూస్:-మండల పరిధిలోని కొల్లూరు గ్రామంలో ఐదవ కొల్లూరు ప్రీమియర్ లీగ్ ను ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు మానసిక శారీరక ప్రశాంతతను పెంపొందిస్తాయి అని అన్నారు. నిరంతరం క్రీడలు ఆడటంతో ఎన్నో రకాల రోగాలు రాకుండా ఉంటాయని చెప్పారు. క్రీడలతో స్నేహభావం ఏర్పడుతుంది అని తెలిపారు. గ్రామ స్థాయిలో ఐక్యతతో కలిసి మెలిసి ఉండాలని సూచించారు.ఆర్గనైజర్లను ప్రత్యేకంగా అభినందించారు. కేపీఎల్ ఆర్గనైజర్స్,సీజన్ 5 నిర్వాహకులు నరసింహ చారి,కృష్ణ ముదిరాజ్ ,చెన్నకేశవులు, రామకృష్ణ, మల్లేష్, శ్రీనివాస్, అరవింద్ ,బాలు గౌడ్, చిట్టెంపల్లి రఘు భరత్,గుర్రం శ్రీనివాసులు,వడ్ల శ్రీకాంత్ ,ఈ కార్యక్రమంలో మండల నాయకులు అధ్యక్షుడు నీరటి రామచంద్రయ్య ,మార్కెట్ చైర్మన్ లింగం ,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వాసు యాదవ్,వైస్ చైర్మన్ తులసిరాం నాయక్ , లక్ష్మీనరసింహారాజు, జహీర్ అత్తర్ , దేపల్లివెంకటేష్ గౌడ్ ,సింగల్ విండో డైరెక్టర్ నాగ అంజయ్య,కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు నీలకంఠ , కంకంటి కృష్ణయ్య, లంబ వెంకటయ్య, నర్సింలు ముదిరాజ్ ,రామకృష్ణ, గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు క్రీడాకారులు పాల్గొన్నారు.