పచ్చని తెలంగాణలో ఆర్థిక సంక్షోభమా

పచ్చని తెలంగాణలో ఆర్థిక సంక్షోభమా

జనం న్యూస్ 09 జనవరి :  విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రజా ప్రభుత్వాలకు ఫ్యూడల్‌ మనస్తత్వం సరికాదుహడావుడిగా తీసుకున్న నిర్ణయం నేరమవుతుందా?కక్షపూరిత రాజకీయాలతో ప్రజలకు మేలు జరగదు మహనీయుల విగ్రహాలు కాదు..కావాల్సింది ఆదర్శాలు లోక్‌సత్తా నేత జయప్రకాశ్‌ నారాయణ కీలక వ్యాఖ్యలు,తెలంగాణ అద్భుతమైన, అదృష్టమైన రాష్ట్రం. హైదరాబాద్‌ లాంటి ఆర్థిక పరిపుష్టి ఉన్న గొప్పనగరం తెలంగాణకు ఉన్నది. ఇటువంటి అవకాశాలున్నచోట ఆర్థిక సంక్షోభమా?' అని లోక్‌సత్తా నేత, మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్‌ నారాయణ ఆందోళన వ్యక్తంచేశారు. ఆర్థిక పరిపుష్టికి అవసరమైన అన్ని వనరులున్నచోట అస్తవ్యస్థ విధానాలా? అని ప్రశ్నించారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని సమతూకంగా పాటించాల్సిందిపోయి కక్షలు, కార్పణ్యాలకు చోటు ఇవ్వకూడదని అభిప్రాయపడ్డారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకంలో పాటించి ప్రజల జీవితాలను బాగుచేయాలని సూచించారు. పచ్చని తెలంగాణ.. ఆర్థికంగా బలమైన రాష్ట్రం.. బలాన్ని మరింత పెంచేవిధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలని పేర్కొన్నారు. ఫార్ములా ఈ-రేస్‌పై ఆయన పరోక్షంగా స్పందిస్తూ తొందరపాటు నిర్ణయం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. లంచం తీసుకున్నారని, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని మాట్లాడటం సరికాదని చెప్పారు. కక్షపూరిత, ద్వేషపూరిత వైఖరి సరైంది కాదని హితవు చెప్పారు. దురదృష్టవశాత్తు అధికారులకూ భక్తి ఎక్కువ అయిపోయిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, వాటి పర్యవసానాలపై ఆయన ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. తెలంగాణలో కులపిచ్చి లేదుతెలంగాణ ఒక అదృష్టమైన రాష్ట్రం. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్‌లో లాగా కులపిచ్చి లేదు. బోలాతనం, మనసున్న మనుషులు, సహకరించే మనుషులున్న రాష్ట్రం తెలంగాణ' అని జయప్రకాశ్‌ నారాయణ పేర్కొన్నారు. ప్రపంచ నగరాలకు ధీటుగా హైదరాబాద్‌ తెలంగాణకు ఉన్నదని, తెలంగాణ చిన్న రాష్ట్రమే అయినా ఆర్థిక పరిపుష్టికి అవసరమైన వనరులున్నాయని వివరించారు. ఇటువంటి రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిలో సమతూకం పాటించాలని సూచించారు. ఇటువంటి పచ్చని రాష్ట్రం ప్రభుత్వ విధానాల వల్ల సంక్షోభంలోకి వెళ్లొద్దని, దురదృష్టవశాత్తు ఆ అవకాశాలు కనిపిస్తున్నాయని హెచ్చరించారు.నిర్ణయం నేరం ఎలా అవుతుంది?ప్రజా ప్రభుత్వాలకు ఫ్యూడల్‌ మనస్తత్వాలు సరికాదని జయప్రకాశ్‌ నారాయణ స్పష్టంచేశారు. ఫార్ములా ఈ-రేస్‌ వ్యవహారంపై లోతుపాతులు తనకు తెలియదని పేర్కొంటూనే, జరుగుతున్న పరిణామాలపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. 'ఒక ప్రభుత్వం విధాన నిర్ణయం, పరిపాలనా నిర్ణయం తీసుకున్నట్టయితే, దురుద్దేశపూర్వకంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆధారాలు ఉంటే తప్ప, లంచం తీసుకున్నారు, అవినీతికి పాల్పడ్డారు అనే ఆధారాలు ఉంటే తప్ప నిర్ణయం తప్పు అనడానికి వీల్లేదు' అని పేర్కొన్నారు. నిర్ణయం నేరం ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. 'నాలుగు రోజులు ప్రచారంలో ఉండటం, ఒకపక్షం అవమానంతో ఉండటం, మరోపక్షం విజయగర్వంతో ఉండటం.. రేపు అధికార మార్పిడి అయ్యాక ఇటుదటు… అటుదిటుగా ఉండటమే పాలనగా సాగిపోయింది' అని వ్యాఖ్యానించారు.డీమానిటైజేషన్‌ ఉద్దేశం మంచిదే. మొదట్లో సమర్థించాను. తరువాత ఇది మంచిది కాదనే నిర్ణయానికి వచ్చాం. కానీ, దానిలో నేరం లేదు. ప్రభుత్వం ముందుచూపు లేకనో, సరైన సమాచారం లేకనో, తొందరపాటుగానో కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. అది మానవ సహజం. అంతమాత్రన దానిని నేరంగా చిత్రీకరించకూడదు' అని అభిప్రాయపడ్డారు. 'ఆ నిర్ణయంలో అవినీతి ఉన్నట్టయితే.. అందువల్ల స్వప్రయోజనం పొందే ప్రయత్నం ఉన్నట్టయితే (రాజకీయ ప్రయోజనం వేరు), లంచం తీసుకున్నట్టయితే, బుద్ధిపూర్వకంగా, దురుద్దేశపూర్వకంగా చేసినట్టయితే.. అది నేరం అవుతుంది కానీ, ఊరికెనే నేరంగా ప్రచారం చేయడం మంచిది కాదు' అని వ్యాఖ్యానించారు. నేర పరిశోధన లేకుం డా తీర్పులు ఇచ్చే సంస్కృతి పెరిగిపోవడం బాధాకరమని అననారు. చట్టం అందరికీ సమానంగా ఉండాలని, ప్రస్తుతం దేశంలో సాగుతున్నది రాజకీయ డ్రామా అని, అది దేశ ప్రయోజనాలకు శ్రేయస్కరం కాదని స్పష్టంచేశారు.బడితె ఉన్న వాడిదే బర్రె!రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా బుద్ధిపూర్వకంగా సొంతలాభం కోసం లంచం (కన్సిడరేషన్‌ ఫర్‌ డెసిసెషన్‌) ఆశించి ఏవైనా నిర్ణయాలు తీసుకున్నారని నిరాధారపూరితంగా అభాండాలు వేయడం మంచిది కాదని జయప్రకాశ్‌ నారాయణ హితవు చెప్పారు. ఏదోరకంగా బద్నాం చేయడమే రాజకీయంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. 'ఏదోరకంగా నాలుగుసార్లు స్టేషన్‌కు పిలవడం, లేదంటే అరెస్టు చేయడం, జైల్లో పెట్టడం.. దానినే గొప్పగా సాధించామని అనుకోవడం ఫ్యూడల్‌ రాజ్యం లాంటిది. ప్రభుత్వాలకు అటువంటి మనస్తత్వాలు ఉండకూడదు. దురదృష్టవశాత్తు అధికార యంత్రాంగం రాజభక్తిని ప్రదర్శిస్తున్నది' అని విమర్శించారు. 'ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టబద్దపాలన జరగాలని, దురదృష్టవశాత్తు 'బడితె ఉన్నవాడితే బర్రె' అన్నట్టుగా సాగిపోతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రతీకార చర్యలు ఏ వ్యవస్థకూ మంచిది కాదని పేర్కొన్నారు. ఎన్నికల ద్వారా అధికారం మారొచ్చు కానీ ప్రభుత్వం శాశ్వతంగా ఉంటుందని, అధికారం మారినా అధికారులు మారరని చెప్పారు.కక్షపూరిత రాజకీయాలతో ప్రయోజనం లేదుకక్షపూరిత రాజకీయాలు ఎవరికీ ప్రయోజనం కాదని జయప్రకాశ్‌ నారాయణ స్పష్టంచేశారు. 'బస్తీమే సవాల్‌’ అనే సంస్కృతి పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యంలో ప్రత్యేకించి రాజకీయాల్లో బద్దవిరోధులు ఉండరు కానీ, ప్రత్యర్థులు ఉంటారని చెప్పారు. సిద్ధాంతాల్లో రాజీలేకుండా బద్దప్రత్యర్థి అయినా సరే సామరస్యంగా మాట్లాడుకోవాలని అయితే, ఆ వాతావరణం కొరవడిందని చెప్పారు. రాజకీయ విభేదాలు పరస్పర పగలకు దారితీయొద్దని ఆకాంక్షించారు.మచ్చలేని నాయకుల ఆదర్శాలకు విలువ ఇవ్వాలిమహాత్మాగాంధీ, అంబేద్కర్‌, పీవీ నరసింహారావు, వాజపేయి, మన్మోహన్‌సింగ్‌ వంటి మచ్చలేని నాయకుల ఆదర్శాలకు విలువ ఇవ్వాలని, వారి ఆదర్శాలను అనుసరించాలని జయప్రకాశ్‌ నారాయణ సూచించారు. అయితే, కేవలం విగ్రహాలు మాత్రమే పెడ్తాం వారి విలువలను ఆచరించం అన్నట్టుగా వ్యవస్థ మారిపోయిందని చురకలేశారు. 'మన్మోహన్‌సింగ్‌ జీవితకాలం చిత్తశుద్ధితో పనిచేసిన నిలువెత్తు నిజాయితీ. వారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే తప్పు లేదు. అదే సమయంలో వారి ఆదర్శాలను పాటించం అన్నట్టుగా వ్యవహరిస్తే విగ్రహం పెట్టి ఏం లాభం?' అని ప్రశ్నించారు.