పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్
జనం న్యూస్ 9 ఆలేరు యాదాద్రి జిల్లా ( రిపోర్టర్ ఎండీ జహంగీర్) ఆలేరు మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మండలం లోని కొలనుపాక గ్రామంలో వాగు లో చెక్ డ్యామ్ నిర్మాణం కోసం 3కోట్ల46 లక్షల 60వేల నిధులతో జాతీయ ఉపాధి హామీ పథకం కింద కొలనుపాక 15 లక్షలు గుండ్ల గూడెం లో 5 లక్షల షారాజీపేటలో గ్రామలలో రూపాయల నిధులతో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఆలేరు పట్టణంలో 50లక్షల రూపాయల నిధులతో మహిళా శక్తి భవనం,తో పాటు ఇందిరమ్మ డెమో ఇల్లు నిర్మాణం కోసం భూమి పూజ చేసి శంఖుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ చెక్ డ్యామ్ వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.గంధమల్ల నుండి మరోసారి రైతులకోసం నీటి ని విడుదల చేయనున్నట్లు సంక్రాంతి పండుగ నుంచి రైతులకు రైతు భరోసా ఇవ్వనున్నట్లు అవసరమయ్యే లబ్ధిదారులకు రేషన్ కార్డు అందజేయనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఈ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలతో పాటు గ్రామాభివృద్ధికి కృషి చేస్తుందని గ్రామాల్లో మిగిలిపోయిన రోడ్లను భవనాలను నిర్మాణం చేసుకొని గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న వారు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఎంఏ ఎజాజ్ సీనియర్ నాయకులు నీలం పద్మ వెంకటస్వామి చింతలపని శ్రీనివాస్ రెడ్డి మల్లెల శ్రీకాంత్ ఎండి జానుద్దీన్ ఎండి గౌస్ ఎండి బాబా మండల పట్టణ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు