షాద్ నగర్ ఎమ్మెల్యేను వెంటనే సస్పెండ్ చేయాలి
బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వైరమణ గౌడ్.....
ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు చెప్పులు చూపించడం దారుణమని అసెంబ్లీ సమావేశం నుండి సస్పెండ్ చేయాలివై రమణ గౌడ్....
జనం న్యూస్ డిసెంబర్20.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్ రాష్ట్ర శాసనసభ్యులు ప్రాతినిధ్యం వచించే పెద్దల సభ, రాష్ట్రానికి శాసనాలను, చట్టాలను తయారుచేసే చట్టసభలో శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అవమాన పరిచేలా అనుచిత, అసభ్యంగా ప్రవర్తించిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను వెంటనే అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్ డిమాండ్ చేశారు. ఈసందర్బంగా వై రమణ గౌడ్ మాట్లాడుతూ ప్రజలు అధికారం కట్టబెడితే హుందాగా, ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నిండు శాసనసభలో కండ కావరంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు చెప్పులు చూపించడం దారుణమని వై రమణ గౌడ్ మండిపడ్డారు. గతంలో కెసిఆర్ హయాంలో శాసనసభలో అతి కొద్దిమంది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలుగా ఉన్నగాని సభ మర్యాదలతో శాసనసభను పది సంవత్సరాల పాటు నడిపిన విషయాన్నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గుర్తుంచుకోవాలని వై రమణ గౌడ్ అన్నారు. నిండు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష ఎమ్మెల్యేకు చెప్పును చూపించిన షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ పై ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసి, అసెంబ్లీ సమావేశాల నుండి సస్పెండ్ చేయాలని మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వై రమణ గౌడ్ డిమాండ్ చేశారు.