వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి. డి ఇ ఒ నాగయ్య
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.రాబోయే పదవతరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు కష్టపడి చదివి వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని నందలూరు మండల విద్యాశాఖాధికారి 1 మరియు 2 ఎల్. నాగయ్య.సీ .ఆర్. అనంతకృష్ణ.హెడ్ మాస్టర్ ఎన్. శ్రీనివాసులు.అసిస్టెంట్ హెడ్ మాస్టర్ షేక్ రౌఫ్ బాష కోరారు.నేడు స్థానిక మండల కేంద్రం లోని నందలూరు హై స్కూల్ లో ప్రభుత్వం విద్యార్థుల కోసం తయారు చేసిన పదవ తరగతి స్టడీ మెటీరియల్, మాదిరి ప్రశ్న పత్రాలను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా నాగయ్య మాట్లాడుతూ మండలం లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఈ మెటీరియల్ అందజేసినట్లు తెలిపారు.కావున ఉపాద్యాయులు విద్యార్ధులకు ప్రణాళిక ప్రకారం తర్ఫీదు యిచ్చి వంద శాతం ఉత్తీర్ణత కోసం కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలోఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.