*ఘనంగా నిర్వహించిన జిల్లా స్థాయి పారా అథ్లెటిక్స్ పోటీలు :*
జనం న్యూస్ 07 జనవరి
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
పారా స్పోర్ట్స్ అసోసియేషన్ విజయనగరం వారి ఆధ్వర్యంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ వారి సహకారంతో జిల్లా స్థాయి పారా అథ్లెటిక్స్ పోటీలు సోమవారం రాజీవ్ స్టేడియం నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు ముఖ్య అతిధిగా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ వి. రామస్వామి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రన్నింగ్, జావలిన్ త్రో, డిస్కస్ త్రో, లాంగ్ జంప్, షాట్ పుట్ క్రీడలకు వివిధ విభాగాల వారీగా పోటీలు నిర్వహించామని తెలిపారు. ఈ పోటీలకు జిల్లా నుండి 70 మంది పారా క్రీడాకారులు పాల్గొనగా ఉన్నత ప్రతిభ కనబరచిన 33 మంది క్రీడాకారులను ఈ నెల 30న గుంటూరులో జరిగబోయే రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచిన క్రీడాకారులను జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నామని తెలిపారు. ఈ పోటీలలో పారా అసోసియేషన్ ఆఫ్ విజయనగరం గౌరవ అధ్యక్షులు కె.దయానంద్, జిల్లా అథ్లెటిక్స్ కార్యదర్శి జి. శ్రీకాంత్, మానవ హక్కుల కమిషన్ చైర్మన్ వడ్డాది మల్లేశ్వరరావు, జిల్లా స్పోర్ట్స్ ఆధారిటి ప్రతినిధులు అర్జీ శ్రీనివాసరావు, ఎన్. ప్రకాష్, పారా స్పోర్ట్స్ ప్రతినిధి లక్ష్మీ, శ్రీకాకుళం అధ్యక్షులు టి. రాము, కోచ్ లు పి. సతీష్, మధు తదితరులు పాల్గొన్నారు.