జాతీయ పోటీలకు 5 గురు జిల్లా క్రీడాకారులు
జనం న్యూస్ 07 జనవరి
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
జనవరి 8 నుంచి 12 వరకు ఉత్తరాఖండ్లో జరగబోయే 50 వ జాతీయ కబడ్డీ పోటీలకు జిల్లా నుంచి 5 గురు క్రీడాకారులు ఎంపికయ్యారని కబడ్డీ సంఘం ఛైర్మన్ ఐవీపీ రాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
జూనియర్ బాల, బాలికల విభాగంలో ఎం.రాంబాబు,సి హెచ్. మురళీ, పి.నందిని, వి.సూర్యకల, ఎం. పావని ఎంపికయ్యారన్నారు. వీరు ఆంధ్రప్రదేశ్ కబడ్డీ టీంకు ఎంపికైనందుకు హర్షం వ్యక్తం చేశారు. పోటీల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.