|ఎల్.హెచ్.ఎం.ఎస్. సౌకర్యాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్.,
జనం న్యూస్ 06 జనవరి
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
జిల్లాలోని విజయనగరం 1వ పట్టణ, 2వ పట్టణ, విజయనగరం రూరల్, నెల్లిమర్ల, బొబ్బిలి పోలీసు స్టేషను
పరిధిలోని మున్సిపల్ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు సంక్రాంతి పండగ సందర్భంగా తమ స్వంత ప్రాంతాలకు వెళ్ళేసమయాల్లో తమ ఇండ్లలో ఎటువంటి దొంగతనాలు జరగకుండా ఉండేందుకు ఎల్.హెచ్.ఎం.ఎస్. (లాక్డ్ హౌస్ మోనటరింగు సిస్టం) సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జనవరి 5న కోరారు.దొంగతనాల నియంత్రణకు రాష్ట్ర పోలీసుశాఖ లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టం (ఎల్.హెచ్.ఎం.ఎస్)ను ప్రత్యేకంగా రూపొందించిందన్నారు. ఈ విధానం పట్ల ప్రజలకు అవగాహన లేకపోవడం వలన ఇల్లు విడిచిపెట్టి బయట ప్రాంతాలకు వెళ్ళే సమయాల్లోనే ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయన్నారు. ఈ మొబైల్ యాప్ సేవలు విజయనగరం 1వ, 2వ, రూరల్, నెల్లిమర్ల, బొబ్బిలి పోలీసు స్టేషను పరిధిలోని కార్పొరేషను, మున్సిపల్ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి అందుబాటులో ఉందన్నారు. ఈ ఎల్.హెచ్.ఎం.ఎస్. మొబైల్ యాప్ వినియోగం వలన ప్రజల ఆస్తుల రక్షణకు కవచంలా పని చేస్తుందన్నారు. ఈ పోలీసు స్టేషను పరిధిలోని ప్రజలెవరైనా తాము ఇల్లు విడిచి తమ స్వంత అవసరాలు లేదా పనులు లేదా ఉద్యోగరీత్యా లేదా పండగలకు లేదా ఏదైన ఇతర కారణాల వలన బయట ప్రాంతాలకువెళ్తున్నట్లుగా సంబంధిత పోలీసు స్టేషనుకు ముందస్తు సమాచారాన్ని అందించినట్లయితే పోలీసులు ఎల్.హెచ్.ఎం.ఎస్.సౌకర్యాన్ని ఉచితంగా అందిస్తారన్నారు. ఇందుకుగాను వారు తమ స్మార్ట్ ఫోనులో గూగుల్ ప్లే స్టోర్ నుండిఎల్.హెచ్.ఎం.ఎస్. యాప్ ను డౌన్లోడు చేసుకొని, ఇంటి నుండే తమ పేరు, ఫోను నంబరు, లొకేషను వంటి ఇతరవివరాలను, ఎల్.హెచ్.ఎం.ఎస్. సేవలను ఎప్పటి నుండి ఎప్పటి వరకు పొందాలని అనుకుంటున్నారన్న విషయాలనుయాప్లో నమోదు చేసి, రిక్వెస్ట్ పంపాలన్నారు. రిక్వెస్ట్ పంపిన తరువాత వారి మొబైల్ నంబరుకు ఒక రిజిస్ట్రేషనునంబరు వస్తుందని, ఈ నంబరునే యూజర్ ఐడిగా పొందవచ్చునన్నారు. ఇలా రిక్వెస్ పంపిన తరువాత సంబంధితపోలీసు స్టేషను నుండి పోలీసులు సదరు ఇంటిని సందర్శించి, సిసి కెమెరాలను ఏర్పాటు చేసి ఆయా ఇండ్లపై ప్రత్యేకంగానిఘా ఏర్పాటు చేస్తారన్నారు. నిఘా కొరకు ఏర్పాటు చేసిన సిసి కెమెరాలతో ఈ యాప్ ను అనుసంధానం చేయడం వలన దొంగతనంలు జరగకుండా నియంత్రించవచ్చునన్నారు. ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఇంటి పరిసరాలలోకిప్రవేసించిన వెంటనే పోలీసు కంట్రోల్ రూంకు సమాచారం చేరవేస్తూ, అలారం మ్రోగుతుందన్నారు. దీనితో పోలీసులుఅప్రమత్తమై, సంబంధిత పోలీసు స్టేషనుకు సమాచారం అందించి, దొంగతనాలు జరగకుండా సులువుగానియంత్రించడంతోపాటు, నిందితులను కూడా రెడ్ హ్యాండడ్ గా పట్టుకోవచ్చునన్నారు. విజయనగరం 1వ, 2వ, రూరల్, బొబ్బిలి, నెల్లిమర్ల పోలీసు స్టేషను పరిధిలోని కార్పొరేషను, మున్సిపల్ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ల్. హెచ్.ఎం.ఎస్.సేవలను సద్వినియోగం చేసుకోవచ్చునన్నారు. ఈ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎప్పుడు ఇతర ప్రాంతాలకు వెళ్ళాలన్నా
ఎల్.హెచ్.ఎం.ఎన్. సౌకర్యాన్ని ఉచితంగా వినియోగించుకోవాలని, దొంగతనాల నియంత్రణలో పోలీసులకు సహకరించాలని ప్రజలను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ కోరారు.