బిజెపి కార్యాలయం పై దాడికి నిరసనగా రాస్తారోకో
జనం న్యూస్ 8 ఆలేరు యాదాద్రి జిల్లా (మండల్ రిపోర్టర్ ఎండి జహంగీర్) ఆలేరు పట్టణంలోని రైల్వే గేటు ఆవరణలో వివేకానంద విగ్రహం వద్ద మంగళవారం రోజున హైదరాబాద్ నాంపల్లి లోని బిజెపి కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు చేసిన దాడికి నిరసనగా బిజెపి పట్టణ మరియు మండల కమిటీ ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమం నిర్వహించడం జరిగింది తదుపరి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి సమాజంలో భౌతిక దాడులకు తావులేదని ఈ అరాచక ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అసెంబ్లీ కన్వీనర్ చిరిగే శ్రీనివాస్ అన్నారు ఈ కార్యక్రమంలోపట్టణ అధ్యక్షుడు నంద గంగేష్ పట్టణ ప్రధాన కార్యదర్శిలు వడ్డేమాన్ నరేందర్ కళ్లెం రాజు గౌడ్ జిల్లా ఉపాధ్యక్షుడు బడుగు జాంగిర్ జిల్లా అధికార ప్రతినిధి తునికి దశరథ ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కామిటికారి కృష్ణ కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి బందెల సుభాష్ జిల్లా కార్యవర్గ సభ్యులు సముద్రాల శ్రీనివాస్ బిజెపి పట్టణ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు